Upendra New Look: కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర షాకింగ్ లుక్...

Actor Upendra New Look: కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కొత్త లుక్ ఫ్యాన్స్‌ను షాక్‌కి గురిచేస్తోంది. ఉపేంద్ర తన కొత్త ప్రొఫైల్ పిక్‌లో లేడీ గెటప్‌లో కనిపించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2022, 07:24 PM IST
  • కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కొత్త లుక్
  • బ్లాక్ చుడీదార్‌లో ఉపేంద్ర
  • ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఉప్పీ
Upendra New Look: కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర షాకింగ్ లుక్...

Actor Upendra New Look: కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ఎంత విలక్షణ నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ తొలినాళ్ల నుంచి ఉపేంద్ర రూటే సెపరేటు. ఉపేంద్ర ఎంచుకునే కథలు మిగతా హీరోల సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. సినిమా కథలే కాదు అందులో ఉపేంద్ర గెటప్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఉపేంద్ర కొత్త సినిమా హోమ్ మినిస్టర్ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఉపేంద్ర తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి హాట్ టాపిక్‌గా మారింది.

బ్లాక్ చుడీదార్‌లో తల, ముఖానికి స్కార్ఫ్ ధరించి ఉన్న ఫోటోను ఉపేంద్ర తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది తన కొత్త ప్రొఫైల్ పిక్ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. అయితే ఇది తన అప్‌కమింగ్ మూవీ 'హోమ్ మినిస్టర్' సినిమాలోనిదా.. లేక ఉపేంద్ర కావాలనే ఇలా లేడీ గెటప్‌లో పోజిచ్చారా అన్న దానిపై స్పష్టత లేదు. కర్ణాటక వ్యాప్తంగా హిజాబ్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ... ఉపేంద్ర ఇలా లేడీ గెటప్‌లో ముఖాన్ని పూర్తి‌గా కవర్ చేసుకుని ఫోటోకి పోజివ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే, ఉపేంద్ర కొత్త సినిమా 'హోమ్ మినిస్టర్' ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. కరోనా కారణంగా రెండేళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. సినిమాలో ఉపేంద్ర సరసన వేదిక హీరోయిన్‌గా నటించింది. సుజయ్.కె శ్రీహరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్ ఈ సినిమాతో కన్నడలోకి ఎంట్రీ ఇస్తున్నారు. 

Also Read: Boycott RRR in Karnataka: 'ఆర్ఆర్ఆర్'కి కన్నడిగుల షాక్... సినిమాను బాయ్‌కాట్ చేయాలని పిలుపు...

Also Read: INDW vs BANW: బ్యాటింగ్‌లో తడబడిన భారత్.. బంగ్లాదేశ్‌కు ఈజీ టార్గెట్! గెలిస్తేనే మిథాలీ సేన నిలిచేది!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News