Big Alert: నేడు ఈ జిల్లాల్లో అతి భారీవర్షాలు.. రెడ్‌, ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీచేసిన హైదరాబాద్‌ వాతావరణ శాఖ..

Big Alert From Hyderabad Metrological Department:  ఉరుములు, మెరుపులతో కూడిని వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆసీఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అలెర్ట్‌ అయ్యారు. ఈ ప్రాంతాల్లో సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశారు.

Written by - Renuka Godugu | Last Updated : Sep 10, 2024, 08:29 AM IST
Big Alert: నేడు ఈ జిల్లాల్లో అతి భారీవర్షాలు.. రెడ్‌, ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీచేసిన హైదరాబాద్‌ వాతావరణ శాఖ..

Big Alert From Hyderabad Metrological Department: వాయువ్య బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో రెడ్‌, ఆరెంజ్‌ అలెర్ట్‌లను కూడా జారీ చేశారు. 

ఉరుములు, మెరుపులతో కూడిని వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆసీఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అలెర్ట్‌ అయ్యారు. ఈ ప్రాంతాల్లో సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని అధికారులు హెచ్చించారు. గోదావరి, ప్రాణహిత, ఎస్‌ఆర్‌ఎస్సీ నదిపరివాహక ప్రాంతాల ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తివేశారు. ఈ ప్రాజెక్టుల వద్ద కూడా ఇప్పటికే అధికారులు అలెర్టుగా ఉన్నారు.

ఈరోజు రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వరదను అంచనా వేస్తూ గేట్లు కూడా ఎత్తే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల పాటు ఇదే పరిస్థితులు ఏర్పడనున్నాయి.ఎల్లంపల్లి గేట్లు కూడా ఎత్తివేశారు. దీంతో నీటి ఉధృతి పెరిగింది.

ఇదీ చదవండి: వరద బాధితులకు భారీ ఊరట.. ప్రతి కుటుంబానికీ రూ.16,500 అందిస్తామన్న మంత్రి పొంగులేటి..

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణలో దాదాపు 20 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని జిల్లాల్లో రెడ్‌ అలెర్ట్‌ కూడా ప్రకటించింది. రాబోయే మూడు రోజులపాటు ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వాయుగుండ తీవ్రంగా మారే అవకాశం ఉంది. పెద్దపల్లి, రాజన్నసిరిసిల్లా, హన్మకొండ, జనగాం, మెదక్‌, కామరెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కొన్ని పాంత్రాల్లో ఉరుములు మెరుపులో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణర శాఖ హెచ్చరించింది. 

ఇదీ చదవండి:  జియో రూ.223 రీఛార్జీప్లాన్‌తో ప్రతిరోజూ 2 జీబీ డేటా.. వ్యాలిడిటీ ఎన్ని రోజులు తెలుసా?

ముఖ్యంగా తెలంగాణలోని 20 జిల్లాల్లో రెండు అలెర్టులను జారీ చేశారు. ముఖ్యంగా కొమురం భీం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పంటపొలలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ప్రభుత్వ సమీక్షలో మంత్రి పొంగులేటి వరద బాధితులకు సాయం అందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వరద బాధితులకు రూ. 16,500 ప్రభుత్వం సాయం అందించనున్నట్లు చెప్పారు. అయితే, భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 33 మంది తెలంగాణ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, ఇందిరమ్మ ఇంటి పత్రాలను కూడా అందజేయనున్నట్లు తెలిపారు.

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News