Traffic Challans: తెలంగాణ వాహనదారులకు అలర్ట్.. పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ రేపటి నుంచే..

Discount on Traffic Challans: మీ వాహనంపై పెండింగ్ చలానా ఉందా.. అయితే రేపటి నుంచే స్పెషల్ డ్రైవ్ ప్రారంభమవుతుందనే విషయం మరిచిపోకండి.. ఈ స్పెషల్ డ్రైవ్ పీరియడ్‌లో పెండింగ్ చలానాపై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2022, 03:45 PM IST
  • తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్
  • రేపటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి
  • మార్చి 30 వరకు అమలులో ఉండనున్న డిస్కౌంట్ ఆఫర్
Traffic Challans: తెలంగాణ వాహనదారులకు అలర్ట్.. పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ రేపటి నుంచే..

Discount on Traffic Challans: తెలంగాణవ్యాప్తంగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై పోలీస్ శాఖ భారీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రేపటి నుంచి (మార్చి 1) మార్చి 30 వరకు 'ఈ-లోక్ అదాలత్' నిర్వహించనున్నారు. ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనదారులు https://echallan.tspolice.gov.in/publicview వెబ్‌సైట్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. ఇందుకోసం ప్రస్తుతం వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేస్తున్నారు. తద్వారా వాహనదారులకు రాయితీ పోగా మిగతా చెల్లింపుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తదితర డిజిటల్ యాప్స్ ద్వారా కూడా పెండింగ్ ఈచలాన్లు చెల్లించవచ్చు.

పోలీస్ శాఖ ప్రకటించిన రాయితీ ప్రకారం.. ద్విచక్రవాహనదారులకు 75 శాతం, కార్లకు 50 శాతం, బస్సులకు 30 శాతం, తోపుడు బండ్లకు 20 శాతం రాయితీ వర్తిస్తుంది. అంటే ఒక బైక్‌పై రూ.1000 చలాన్ పెండింగ్‌లో ఉంటే.. ఈ-లోక్ అదాలత్ ద్వారా అతను కేవలం రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. మిగతా మొత్తం మాఫీ అవుతుంది. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే సుమారు రూ.600 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండిపోవడంతో.. వాటి వసూళ్లకు రాయితీని అమలుచేయాలని నిర్ణయించారు. ఇదే అవకాశాన్ని రాష్ట్రంలోని వాహనదారులందరికీ కల్పిస్తున్నారు.

ఇక కరోనా సమయంలో మాస్క్ ధరించకుండా నిబంధనలు ఉల్లంఘించినవారికి కూడా తాజాగా రాయితీ ప్రకటించారు. రూ.1000 జరిమానాకు గాను రూ.100 రాయితీ ఇస్తున్నారు. ఈ ఆఫర్ కూడా నెల రోజుల వరకు అందుబాటులో ఉండనుంది. మీ సేవా కేంద్రాలు, డిజిటల్ పేమెంట్ యాప్స్, తెలంగాణ ఈ చలాన్ ద్వారా ఈ చెల్లింపులు జరపవచ్చు. 

Also Read: Viral Video: తాబేలును అమాంతం మింగబోయిన మొసలి.. చివరలో ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Also read: Flipkart Smartphone Offer: రూ.17,000 విలువైన Motorola స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.451లకే కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News