Eggs Attack Kale Yadaiah: ప్రభుత్వ సంక్షేమ పథకాల కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యపై దాడికి పాల్పడ్డారు. అతడి పర్యటనను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఆయనకు బుద్ధి చెప్పేందుకు దాడికి పాల్పడ్డామని తెలిపారు. ఈ సంఘటన తెలంగాణ కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు దాడులు కలకలం రేపింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో చోటుచేసుకుంది.
Also Read: K Kavitha: జైలు బయట బోరున ఏడ్చిన కవిత.. వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరిక
చేవెళ్ల నియోజకవర్గం షాబాద్‌లోని ఎంపీడీఓ కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లబ్దిదారులకు చెక్కులు అందించేందుకు ఎమ్మెల్యే యాదయ్య అక్కడకు చేరుకున్నారు. అయితే బీఆర్‌ఎస్ పార్టీ నుంచి తమ పార్టీలోకి మారడంతో కాంగ్రెస్ పార్టీ వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. యాదయ్యకు బుద్ధి చెప్పాలని పక్కా ప్రణాళిక వేసుకున్నారు. చెక్కుల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే కాలె యాదయ్యపై కోడి గుడ్లతో కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
Also Read: Kavitha Bail: కవితపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు.. కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న భీమ్ భరత్‌కు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం నిర్వహించడంతో అతడి అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. స్థానిక నాయకత్వానికి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే షాబాద్‌కు ఎలా వస్తాడని ప్రశ్నించారు. పదేళ్ల నుంచి షాబాద్ ప్రాంతానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య అభివృద్ధి చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి విచ్చలవిడిగా ఆస్తులు సంపాదించుకొని.. ఆ ఆస్తులను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరారని భీమ్ భరత్ అనుచరులు ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులకు నామినేట్ పోస్టులను ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ దాడి చేసినట్లు సమాచారం. కాగా దాడికి పాల్పడిన అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిపై కేసు నమోదయ్యే అవకాశం ఉంది.
ఆ నియోజకవర్గాల్లో గందరగోళం
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి మాదిరిగా ఉంది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం వారి చేరికను ఆహ్వానించినా క్షేత్రస్థాయిలో ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు అసహనంతో ఉన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గద్వాల, స్టేషన్ ఘన్‌పూర్, చేవెళ్ల, రాజేంద్రనగర్, ఖైరతాబాద్‌లో పరిస్థితి గందరగోళంగా ఉంది. స్థానిక కాంగ్రెస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు సహకరించడం లేదు. దీంతో తరచూ ఆయా నియోజకవర్గాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter