Kavitha Bail: కవితపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు.. కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

KT Rama Rao Fire On Bandi Sanjay Kumar Amid Kavitha Bail Petition: తెలంగాణలో కవిత బెయిల్‌ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. బెయిల్‌ మంజూరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ తీవ్రంగా తప్పుబట్టారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 27, 2024, 04:03 PM IST
Kavitha Bail: కవితపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు.. కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

KT Rama Rao: కొన్ని నెలల అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్‌ లభించడంతో తెలంగాణ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. కవితకు బెయిల్‌ రావడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగారు. అయితే బెయిల్ రావడంపై కాంగ్రెస్‌, బీజేపీలు వక్ర భాష్యం చెబుతున్నాయి. కవిత బెయిల్ అంశంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా వాటిని బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. కవిత సోదరుడు, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బండి సంజయ్‌పై మండిపడ్డారు.

Also Read: MLC Kavitha Case: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ to బెయిల్.. పూర్తి వివరాలు ఇవే..!

 

బండి సంజయ్‌ స్పందన
'మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీకి బెయిల్‌ లభించినందుకు కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీ న్యాయవాదులకు అభినందనలు. మీ అలుపెరగని ప్రయత్నాలు చివరకు ప్రతిఫలం లభించింది. ఈ బెయిల్‌ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండింటికీ విజయం. కాంగ్రెస్‌ వ్యక్తికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంతో కవితకు బెయిల్‌ లభించింది. బెయిల్‌ కోసం వాదించిన అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి రాజ్యసభ సీటు నామినేట్‌ చేయడంలో కేసీఆర్‌ అద్భుతమైన రాజకీయ చతురత పాటించారు' అని బండి సంజయ్‌ అక్కసు వెళ్లగక్కారు.

Also Read: Akbaruddin Owaisi: బుల్లెట్లతో నన్ను కాల్చండి.. నా కాలేజ్‌ను కాదు: అక్బరుద్దీన్‌ సంచలనం

అర్హత లేదు
బాధ్యతాయుత కేంద్ర మంత్రి పదవిలో ఉండి సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై బండి సంజయ్‌ వక్రభాష్యం పట్టడం తీవ్ర దుమారం రేపుతోంది. సంజయ్‌ తీరుపై బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. న్యాయస్థానం తీర్పునే తప్పుబట్టడం సరికాదని పేర్కొంటున్నారు. ఒక కేంద్ర మంత్రే న్యాయస్థానంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే కోర్టు ఉల్లంఘన కిందకే వస్తుందని చెబుతున్నారు. కంటెప్ట్‌ ఆఫ్‌ కోర్టు కిందకు వస్తుందని కేటీఆర్‌ హెచ్చరించారు.

'హోం శాఖ మంత్రిగా ఉన్న మీరు సుప్రీంకోర్టు తీర్పునే తప్పుబడుతున్న మీరు ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు కంటెంప్ట్‌ ఆఫ్‌ ప్రొసిడింగ్స్‌ కిందకు వస్తాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా' అని కేటీఆర్‌ 'ఎక్స్‌'లో పోస్టు చేశారు. హోం శాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి కోర్టు తీర్పుకే వక్రభాష్యం పట్టడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బండి సంజయ్‌ వైఖరి వివాదం రేపుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News