Bandi Sanjay Slams CM KCR: వేములాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి మాట తప్పిన దుర్మార్గుడు కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. శివయ్యనే మోసం చేశాడు.. కేసీఆర్ మూర్ఖపు పాలన అంతం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ ఆలయం వద్ద భక్తుల కోసం బీజేపీ మెడికల్ సెల్ ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని సందర్శించారు. అంతకుముందు మీడియాతో మాట్లాడారు.
'లక్షలాది మంది భక్తులు కనీస సౌకర్యాల్లేక భక్తులు అల్లాడుతున్నారు. నీళ్లు కూడా లేక పసిపిల్లలు ఏడుస్తున్నారు. శివ దీక్షలు తీసుకున్న వేలాది మంది భక్తులకు సౌకర్యాల్లేవు. కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే స్వార్ధపరుడు. వేములాడకు నయా పైసా ఇయ్యకుండా ఇక్కడి పైసలు తీసుకుపోయి బయట ఖర్చు చేయడం సిగ్గు చేటు. కేసీఆర్ పేదల ద్రోహి. కావాలనే వేములవాడ దేవస్థానాన్ని నిర్లక్ష్యం చేశారు.
ఇదే దేవాలయంలో పెళ్లి చేసుకున్న మర్చిపోనని చెప్పిన కేసీఆర్.. ఏటా వంద కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఖర్చు చేస్తానని మాట తప్పిండు.. శివ భక్తులు చేసిన తప్పేంటి..? కనీస సౌకర్యాలు కల్పించేందుకు నీకు మనసెందుకు రావడం లేదు..? భక్తులంతా కేసీఆర్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉన్నా సిగ్గు రావడం లేదు. ఇవాళ కనీస సౌకర్యాల్లేక కష్టాలు పడుతున్న శివ భక్తులు కేసీఆర్‌ను ఎన్నటికీ మరవలేరు. ప్రసాదం స్కీమ్ కింద ప్రతిపాదనలు పంపితే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తానని నేను ఎంపీగా గెలిచినప్పటి నుంచి రెండు చేతులెత్తి వేడుకున్నా.. వేములాడతోపాటు కొండగట్టు, ధర్మపురి ఆలయాల అభివృద్ధి కోసం కూడా ప్రతిపాదనలు పంపాలని అడిగినా.. కానీ పట్టించుకోలేదు. శివుడు అన్నీ గమనిస్తున్నాడు. కేసీఆర్ మూర్ఖపు పాలన పీడ విరగడ కావాలని కోరుకుంటున్నా..' అని బండి సంజయ్ అన్నారు.
Also Read: Geetha Singh: రోడ్డు ప్రమాదంలో హాస్యనటి గీతాసింగ్ కుమారుడు మృతి
Also Read: AP Cabinet: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ అయిదుగురు మంత్రులు ఔట్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
దొంగ సారా దందా కేసులో కోర్టు డిస్మిస్ చేసిన బెయిల్ వ్యవహారంలో కేసీఆర్ బిడ్డ పేరును నాలుగు సార్లు ప్రస్తావించారని ఆయన గుర్తుచేశారు. దొంగ సారా దందా, పత్తాల దందా కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని.. పేదల దేవుడు రాజన్న ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం వహించడం మూర్ఖత్వమని మండిపడ్డారు. పేదల కోసం, రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 10 కోట్లు కూడా ఖర్చు చేయడం లేదన్నారు. 'నీ బిడ్డ దొంగ సారా దందా కోసం వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి..? శివుడు అన్నీ చూస్తున్నరు. దొంగ సారా దందాలో ఢిల్లీ డిప్యూటీ సీఎంకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. నీ బిడ్డకు కూడా ఏం జరగాలో అదే జరుగుతుంది..' అంటూ చెప్పొచ్చారు బండి సంజయ్.