న్యూ ఢిల్లీ: తెలంగాణ సర్కార్‌పై బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కరోనావైరస్ వ్యాప్తిని ( Coronavirus ) అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జేపి నడ్డా మండిపడ్డారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం ( Ayushman Bharat scheme ) కింద 55 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలిగిందని... ఐతే తెలంగాణ సర్కార్ ( Telangana govt ) మాత్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకుండా ఆ పథకం ఫలాలు ఎవరికీ అందకుండా చేసిందని నడ్డా ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం అందిస్తున్న అభివృద్ధి ఫలాలను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల వరకు చేరనివ్వడం లేదని ఆరోపించారు. సోమవారం తెలంగాణలోని 9 జిల్లాల్లో జిల్లా కార్యాలయాల నిర్మాణం కోసం జరిగిన భూమి పూజ కార్యక్రమంలో జేపి నడ్డా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేపి నడ్డా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. Also read: Chiru Sunday Special: అమ్మ కోసం చేపల ఫ్రై
ఇదిలావుంటే, మరోవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ సైతం అవకాశం చిక్కినప్పుడల్లా తెలంగాణ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగుతూనే ఉన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెల్చుకుని కొంత ఫామ్‌లోకి వచ్చిన బీజేపి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీకి తామే ఒక ప్రత్యామ్నాయంగా మారుతామని ధీమా వ్యక్తంచేస్తోంది. Also read: Sanjay Dutt: ఆసుపత్రి నుంచి సంజయ్ దత్ డిశ్ఛార్జ్