Etela on Kcr: తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై విపక్షాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్ర పరిస్థితులను పట్టించుకోకుండా దేశ పర్యటన ఏంటని మండిపడుతున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు.
సంపన్న రాష్ట్రం తెలంగాణను దివాళా తీయించారన్నారు. రాష్ట్ర అప్పు ఇప్పటికే రూ.5 లక్షల కోట్లు దాటిపోయిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ లెక్కలను కాగ్ బయట పెట్టిందని చెప్పారు. ఆ లెక్కలు బయటకు రాకుండా సీఎం కేసీఆర్ దాచి పెడుతున్నారని మండిపడ్డారు. అప్పులు చేసి రాచరికం అనుభవించడం ఏంటని ప్రశ్నించారు. అభివృద్ధి గురించి కనీసం పట్టించుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని కార్పొరేషన్ల పరిస్థితి సైతం దారుణంగా ఉందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణాల విధానం దేశమంతా ఒకేలా ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కేబినెట్‌లోని మంత్రులకు కనీస అవగాహన లేదన్నారు. వారికి మాటలు తప్ప చేతలు లేవని మండిపడ్డారు. రైతులను మిల్లర్లు నిండా ముంచుతున్నా..పట్టించుకునే నాదుడు లేరన్నారు. ప్రతి క్వింటాల్‌కు 8 కిలోల తరుగు తీస్తున్నారని నిప్పులు చేరిగారు.
రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెబుతున్నారన్నారు ఈటల. తెలంగాణలో ప్రజలను ఎదుర్కొలేకనే జాతీయ రాజకీయాలంటూ యాత్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో తలదూర్చితే..టీడీపీ అధినేత చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్ర మంత్రులు తమ నోర్లను అదుపులో పెట్టుకోవాలన్నారు. ఢిల్లీ టూర్ దేని కోసమో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also read:Paytm: పేటీఎం పలు కీలక నిర్ణయాలు..సీఈవోగా మళ్లీ ఆయనకే అవకాశం..!
Also read:Petrol, Diesel Prices: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీ తగ్గింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook