PM Modi Hyderabad Visit: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు తెలంగాణ పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేస్తోంది. వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు పార్టీ నేతలు హైదరాబాద్‌లో మూడు రోజులు పర్యటన చేయనున్నారు. ఒక్కసారిగా అలెర్ట్ అయిన పోలీసులు ఐదు వేల మంది సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎస్పీజీ సూచనలతో పాటు నగరంలో 144 సెక్షన్ ఆంక్షలు అమలుచేస్తున్నారు. హైదరాబాద్ వేదికగా జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు. ఇక 3వ తేదీన ప్రధాని మోదీ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో వెలిసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు కలకలం సృష్టించగా.. అప్రమత్తమైన అధికారులు వెంటనే వాటిని తొలగించారు. ఐదువేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో ఉన్నంతసేపు మూడంచెల భద్రత కొనసాగించనున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, హెచ్ఐసీసీ, రాజ్ భవన్ చుట్టూ కేంద్ర బలగాలు మోహరించారు. తన హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ రాజ్‌భవన్‌లో బస చేస్తారని తెలుస్తున్నా. దానిపై ఎస్పీజీ నిర్ణయం తీసుకోనుంది. కానీ, రాజ్‌భవన్‌లో బస చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటున్నారు తెలంగాణ పోలీసులు. దీంతో, రాజ్‌భవన్ కాకుండా ఏదైనా హోటల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బస చేస్తారని కూడా ప్రచారం సాగుతోంది. మరోవైపు జెడ్ ప్లస్ కేటగిరి ఉన్న హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నోవాటెల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మొత్తంగా హైదరాబాద్‌ను పెద్ద స్థాయిలో వీఐపీ, వివిఐపీలు రానున్నారు. తదనుగునంగా భద్రతా చర్యలు చేపడుతున్నారు పోలీసులు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళన విధ్వంసానికి దారితీసిన నేపథ్యంలో పోలీసులు సెక్యూరిటీని పెంచారు.
ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్ కారణంగా మూడు కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ లిమిట్స్‌లో నో ఫ్లయింగ్ జోన్స్‌గా గుర్తించారు. సైబరాబాద్ పరిధిలోని నోవాటేల్, హైదరాబాద్ పరిధిలోని పరేడ్ గ్రౌండ్, రాజ్ భవన్ పరిసరాల్లో నో ఫ్లయినింగ్ జోన్స్ ఏర్పాటు చేశారు. డ్రోన్స్, రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్స్, మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్స్‌పై నిషేధం అమల్లో ఉండనుంది.
ఈ నెల 30 ఉదయం 6 గంటల నుంచి జులై 4వ తేదీ సాయంత్రం 6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పోలీస్ ఆంక్షలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయటం తెలంగాణ అధికారపార్టీకి ఇష్టం లేకపోవటం.. ఇప్పటికే వ్యతిరేక దోరణితో నేతల మాటలు, ఫ్లెక్సీలు దర్శనం ఇస్తుండటంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. ఏ క్షణం ఏం జరగబోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Also read : Corona Updates in Telangana: తెలంగాణలో ఫోర్త్ వేవ్ బెల్స్..పెరుగుతున్న రోజువారి కేసులు
Also read : TS DOST 2022: నేడే దోస్త్ నోటిఫికేషన్.. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోండిలా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.