Bandi Sanjay: తెలంగాణలో మళ్లీ వరి రగడ..సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ..!

Bandi Sanjay: తెలంగాణలో వరి పోరు మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి వరకు ధాన్యం కొనుగోలుపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్‌ కొనసాగింది. ఢిల్లీలో సైతం సీఎం కేసీఆర్ ధర్నా చేపట్టారు. చివరకు యాసంగి పంటను తామే కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే చాలా చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు ప్రారంభించారు. దీంతో వరి వార్‌ ముగిసినట్లేంది. తాజాగా వరిపై టీఆర్ఎస్‌, తెలంగాణ బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 03:22 PM IST
  • తెలంగాణలో తెరపైకి వరి రగడ
  • సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖాస్త్రం
  • కొనుగోలు కేంద్రాలు ఎక్కడున్నాయని ఫైర్
Bandi Sanjay: తెలంగాణలో మళ్లీ వరి రగడ..సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ..!

Bandi Sanjay: తెలంగాణలో వరి పోరు మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి వరకు ధాన్యం కొనుగోలుపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్‌ కొనసాగింది. ఢిల్లీలో సైతం సీఎం కేసీఆర్ ధర్నా చేపట్టారు. చివరకు యాసంగి పంటను తామే కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే చాలా చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు ప్రారంభించారు. దీంతో వరి వార్‌ ముగిసినట్లేంది. తాజాగా వరిపై టీఆర్ఎస్‌, తెలంగాణ బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. 

వరి కొనుగోలుపై సీఎం కేసీఆర్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రతి గింజ కొంటామని చెప్పారని..కానీ క్షేత్ర స్థాయిలో అవేవి కనిపించడం లేదని లేఖలో ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ ప్రకటలన్నీ మాటలకేనని మరోసారి రుజువయ్యిందన్నారు. తక్షణమే వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి..విక్రయాలు ప్రారంభించాలని లేఖలో డిమాండ్‌ చేశారు. తాను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నానని..ఈ విషయాన్ని రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. 

జోగులాంబ గద్వాల్ జిల్లాలో 71 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉందని..కానీ కేవలం రెండు మాత్రమే ప్రారంభించారని లేఖలో మండిపడ్డారు. వనపర్తి జిల్లాలో 225 కేంద్రాలకు గాను 19 ఏర్పాటు చేశారని, ఇటు నారాయణపేట్‌లో 91 కేంద్రాలకు 70 మాత్రమే ఉన్నాయని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉందని..ఐతే కేవలం 2 వేల 500 కేంద్రాలను మాత్రమే ప్రారంభించారని బండి సంజయ్‌ మండిపడ్డారు.

తెలంగాణలో మొత్తం 60 లక్షల టన్నుల ధాన్యం కొనాల్సి ఉందని తెలిపారు. ఇప్పటివరకు కేవలం 2 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని లేఖలో ఆక్షేపించారు. ఈ లెక్కల బట్టే తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అర్థమవుతుందన్నారు. టీఆర్ఎస్‌ సర్కార్.. రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రజా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వరి రైతులకు అండగా పోరాటం కొనసాగిస్తామన్నారు బండి సంజయ్. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి..ప్రతి గింజా కొనుగోలు చేయాలన్నారు.

మరోవైపు బండి సంజయ్‌(BANDI SANJAY) లేఖపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. యాసంగిలో ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా..సీఎం కేసీఆర్(CM KCR) తీసుకుంటున్నారని చెబుతున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఎవరు ఎలా చేస్తున్నారో ప్రజలకు తెలుసని అంటున్నారు. తమది రైతు ప్రభుత్వామని..దీంట్లో ఎలాంటి అనుమానాలు లేవని చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు. మొత్తంగా తెలంగాణలో వరి సెగలు తగ్గడం లేదు. టీఆర్ఎస్‌, బీజేపీ నేతలు ఎవరికీ వారు తమ వాదనలు వినిపిస్తున్నారు. 

Also read:Krithi Shetty Photos: చీరకట్టు అయినా మోడ్రన్ డ్రస్సు అయినా బేబమ్మ తర్వాతే ఎవరైనా!

Also read:GT vs RCB: గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ నేడే, విరాట్ కోహ్లీ ఫామ్‌పైనే ఆశలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News