Boyfriend kills girlfriend : ప్రియురాలిపై అత్యాచారం చేసి చంపేసిన ప్రియుడు

Boyfriend kills girlfriend in Karimnagar district : ప్రియురాలిపై రేప్, మర్డర్. హత్యాచారానికి పాల్పడ్డ ప్రియుడు. కరీంనగర్‌‌లో దారుణం. ప్రియురాలిని నమ్మించి బయటకు తీసుకెళ్లి హత్యాచారానికి పాల్పడ్డ ప్రియుడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 07:39 PM IST
  • కరీంనగర్ జిల్లాలో దారుణం..
  • ప్రియురాలిని నమ్మించి బయటకు తీసుకెళ్లిన ప్రియుడు
  • రేప్‌ చేసి చంపేసిన బాయ్​ఫ్రెండ్
Boyfriend kills girlfriend : ప్రియురాలిపై అత్యాచారం చేసి చంపేసిన ప్రియుడు

Boyfriend kills girlfriend in Karimnagar district Manakondur Mandal chengerla : ప్రేమించిన అమ్మాయిని నమ్మించి వెంట తీసుకెళ్లాడు ఆ ప్రియుడు. తర్వాత హత్యాచారానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా (karimnagar district) మానకొండూరు మండలం (Manakondur Mandal) చెంజర్ల గ్రామ శివారులో (chengerla) యువతి మృతదేహం లభ్యమైంది. చెంజర్ల గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. 

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం (Thimmappur Mandal) మన్నెంపల్లి గ్రామానికి చెందిన యువతి.. పోరండ్ల గ్రామానికి చెందిన అఖిల్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమలో (Love) ఉన్నారు. అయితే ఇటీవల అఖిల్‌ తన ప్రియురాలిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం (Rape) చేశాడు. ఆ తర్వాత ఆమెను చంపాడు (Murder) అని పోలీసులు వెల్లడించారు.అయితే వారం రోజుల క్రితం తమ అమ్మాయి కనిపించడం లేదంటూ మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read : AP Corona cases: ఏపీలో కొత్తగా 839 మందికి కొవిడ్​ పాజిటివ్​- యాక్టివ్ కేసులు @ 3,659

తాజాగా ప్రియుడు అఖిల్‌ని పోలీసులు విచారించగా అసలు విషయం బయపడింది. తానే తన ప్రియురాలిపై అత్యాచారం చేసి, (Rape) హత్య చేశానని అఖిల్ ఒప్పుకున్నాడు. హత్యాచారం (Rape and Murder) చేసిన ప్రదేశానికి నిందితుడు పోలీసులను తీసుకెళ్లి చూపించాడు.

Also Read : COVID-19: బాలీవుడ్‌ను ఆడేసుకుంటున్న కరోనా.. స్టార్ డైరెక్టర్, హీరోయిన్‌కు పాజిటివ్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News