Chicken Price Hike: ట్రిపుల్‌ సెంచరీ కొట్టిన కోడి.. రూ.300 దాటిన కేజీ చికెన్‌ .. ఎందుకో తెలుసా?

Chicken Price Hike: కోడి ధరలు కొండెక్కాయి.. ఐపీఎల్‌ సీజన్‌ కాబట్టి ట్రిపుల్‌ సెంచరీ కొట్టిన కోడి అంటే బెట్టరేమో.. అంతేకాదు ప్రస్తుతం ఎండలు మాత్రమే కాదు చికెన్‌ ధరలు కూడా భగ్గుమంటున్నాయి. ఎందుకో తెలుసా?

Written by - Renuka Godugu | Last Updated : May 26, 2024, 12:02 PM IST
Chicken Price Hike: ట్రిపుల్‌ సెంచరీ కొట్టిన కోడి.. రూ.300 దాటిన కేజీ చికెన్‌ .. ఎందుకో తెలుసా?

Chicken Price Hike: కోడి ధరలు కొండెక్కాయి.. ఐపీఎల్‌ సీజన్‌ కాబట్టి ట్రిపుల్‌ సెంచరీ కొట్టిన కోడి అంటే బెట్టరేమో.. అంతేకాదు ప్రస్తుతం ఎండలు మాత్రమే కాదు చికెన్‌ ధరలు కూడా భగ్గుమంటున్నాయి. ఎందుకో తెలుసా? తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌ ధరలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. కిలో చికెన్ రూ. 300 దాటింది. ఇక గుడ్లు కూడా అదే బాట పడుతున్నాయి. ఈ ధరలు చికెన్ ప్రియులకు పెద్ద షాక్ ఇస్తున్నాయి. ఆదివారం వచ్చినా.. ఏ వేడుకలు జరుపుకోవాలన్నా చికెన్, మటన్ ఉండాల్సిందే. ముక్క లేనిదే ముద్ద దిగని వారు కూడా ఉన్నారు. చికెన్‌ త్వరగా వండుకోవచ్చు. వీటితో రకరకాల వంటలు చేసుకోవచ్చు. అంతేకాదు దీంతో ఏ రిసిపీ తయారు చేసిన రుచిగా అవ్వాల్సిందే. అందుకే సండే వచ్చిందంటే చాలు. చికెన్ షాపులకు భారీ ఎత్తున ప్రజలు క్యూ కడతారు. అయితే, వారికి మాత్రం ఈ వార్త మాత్రం ఛేదు నిజం.. 

ఇదీ చదవండి: రాష్ట్ర గీతంపై వివాదం.. కీరవాణి ఎందుకు..? మనోళ్లు లేరా..?

చికెన్ ధరలు కొండక్కడంతో ఇది సామాన్యులకు షాకిస్తోంది. చికెన్ ధరలు ఇలా ట్రిపుల్‌ సెంచరీ కొట్టడానికి ప్రధాన కారణం. ఎండ వేడిమితో చాలా కోళ్లు చనిపోవడం, దాన సరిగ్గా దొరక్కపోవడంతో కోళ్లు బరువు పెరగలేదు. ఈ రెండూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా చికెన్‌ ధరలు ఆకాశన్నంటడానికి ప్రధాన కారణమట. అంతేకాదు దీనికి మరో కారణం కూడా ఉంది. రవాణా ఛార్జీలు కూడా విపరీతంగా పెరగడం కూడా మరో కారణం. దీంతో చికెన్‌ కొనాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఏర్పాడ్డాయి. 

ఇదీ చదవండి: సీఎం రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్.. మంత్రి సీతక్కకు ఆ పదవీ..?.. మూహుర్తం అప్పుడే..

ఎండ వేడిమి తాళలేక చాలా వరకు కోళ్లు ఫారమ్‌లలో చనిపోయాయి. ఇలా జరగడం వల్ల లాభాలు కాకుండా నష్టాలు కూడా చూడటంతో ఎక్కువ శాతం రైతులు కోళ్ల పెంపకం నుంచి కూడా దృష్టి మరల్చారు. దీనివల్ల కూడా తగినంత కోళ్ల సరఫరా లేకపోవడంతో ఇలా చికెన్‌ ధరలు ట్రిపుల్‌ సెంచరీని కొట్టడానికి ఇంకో కారణం కూడా. ముఖ్యంగా రిటైల్ కాకుండా కేజీ స్కిన్ లెస్‌ చికెన్‌ రూ. 320 పలుకుతోంది. ఇది చికెన్‌ ప్రియులకు షాకిస్తోంది. ఇక చికెన్‌ తినాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News