CM KCR: ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు: సీఎం కేసీఆర్‌

CM KCR: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో తెరాస శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ జరిగింది. సంస్థాగత ఎన్నికలు, సర్వసభ్య సమావేశం, ప్లీనరీపై చర్చించారు. నవంబరు 15న వరంగల్‌లో పదిలక్షల మందితో విజయగర్జన సభ నిర్వహించనున్నట్టు తెరాస అధినేత స్పష్టం చేశారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2021, 06:31 PM IST
CM KCR: ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు: సీఎం కేసీఆర్‌

CM Kcr: టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ముగిసింది.  తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్నిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ జరిగింది. హుజురాబాద్‌ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్‌(CM Kcr) చర్చించారు. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. హుజరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఈ నెల 27న సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో హుజరాబాద్‌లో సభ నిర్వహించడానికి సమావేశంలో నిర్ణయించారు. 

హుజూరాబాద్‌  ఉప ఎన్నిక(huzurabad by election)లో గెలిచితీరుతామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. ఇంకా రెండేళ్లు ఉంది. అన్ని పనులు చేసుకుందామని కేసీఆర్‌ అన్నారు. భవిష్యత్‌లో టీఆర్‌ఎస్‌(TRS) ఎక్కువ స్థానాలు గెలిచేలా పనిచేయాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్‌లో నవంబరు 15న  ప్రజాగర్జన సభ నిర్వహించాలని సీఎం సూచించారు. వరంగల్‌ సభ(Warangal Sabha)పై కేటీఆర్‌ అధ్యక్షతన నియోజకవర్గాలవారీ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.

Also Read: Kodali Nani : చంద్రబాబుపై ఫైర్ అయిన కొడాలి నాని

ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్న కేసీఆర్‌.. వాటిని వివరించే బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని తెలిపారు. అందుకోసం త్వరలో పార్టీ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెరాసదే విజయమని స్పష్టంచేసిన కేసీఆర్‌.. కేంద్రంలోనూ క్రియాశీల పాత్ర పోషిస్తామని పునరుద్ఘాటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News