Cm Revanth Reddy clarity on Telangna job calendar foar govt jobs recruitment: తెలంగాణలో కొన్ని రోజులుగా నిరుద్యోగులు తమ నిరసనను తీవ్ర తరం చేశారు. ముఖ్యంగా అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ లలో వేలాదిగా నిరుద్యోగులు రోడ్ల మీదకు చేరుకుని తమ నిరసన తెలిపారు. గ్రూప్స్ ఎగ్జామ్ లు వాయిదా వేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో.. నిరుద్యోగుల నిరసన కాస్త ప్రభుత్వంపెద్దల వరకు వెళ్లింది. మొదట ఎగ్జామ్ లను వాయిదావేసేదిలేదన్న ప్రభుత్వం. మరల నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ పట్ల చర్చించింది. ఈ క్రమంలో నిన్న సీఎం రేవంత్ అధికారులు, విద్యావేత్తలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత నిరుద్యోగుల కోరికమేరకు.. గ్రూప్ 2 ఎగ్జామ్ లను డిసెంబర్ కు వాయిదావేస్తున్నట్టు ప్రకటించారు. ఎగ్జామ్ తేదీలను తొందరలోనే ప్రకటిస్తామని కూడా టీజీఎస్పీఎస్పీ వెల్లడించింది.
అసెంబ్లీలో జాబ్ క్యాలండర్ డిక్లేర్ చేస్తాం
రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీ వివరాలను మార్చ్ 31వ తేదిలోపు అన్ని శాఖల నుండి తెపించుకొని.. జూన్ 2వ తేదీ లోపు నోటిఫికేషన్లు ఇస్తాం
డిసెంబర్ 9వ తారీకు లోపల ప్రతి సంవత్సరం ఎన్ని ఖాళీలు ఉన్నా భర్తీ చేసి వాళ్ల నియామకపత్రాలు వాళ్ల… pic.twitter.com/DwEzaelnqO
— Telugu Scribe (@TeluguScribe) July 20, 2024
ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో కలిసి ప్రజాభవన్ లో సమావేశమయ్యారు. ప్రజా భవన్ లో "రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం" ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడిందన్నారు. కొన్నిరోజులుగా నిరుద్యోగులు చేస్తున్న రిక్వెస్ట్ లపై పూర్తి స్థాయిలో చర్చించామన్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడం తమ ప్రథమ కర్తవ్యమన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు.
గత ప్రభుత్వం పాలనలో పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందన్నారు. అందుకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశామని పేర్కొన్నారు. గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించామన్నారు. డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయన్నారు.
నిరుద్యోగులు చదువుకోవడానికి గ్యాస్ లేనందున, ఇబ్బందులను గుర్తించి గ్రూప్-2 పరీక్షవాయిదా వేశామని చెప్పారు. ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే అని క్లారిటీ ఇచ్చారు. పకడ్బందీ ప్రణాళికతో ప్రభుత్వ పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అదే విధంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఇక నుంచి ప్రతీ ఏటా మార్చ్‌లోగా అన్ని శాఖలలో ఖాళీల వివరాలు తెప్పించుకుంటామన్నారు. జూన్ 2 లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
అదే విధంగా.. నిరుద్యోగులు కేంద్ర సర్వీసులు, రైల్వే జాబ్ ల కోసం కష్టపడి చదవాలన్నారు. వెనుక బడిన రాష్ట్రంగా చెప్పుకునే బీహార్, యూపీల నుంచి యూపీఎస్సీ, రైల్వేలు, ఇతర డిపార్ట్ మెంట్ లలో ఎక్కువగా ఉంటారని, మనంకూడా వారికి పోటీగా కష్టపడి చదవి కేంద్ర సర్వీసులలో జాబ్ లను సాధించాలన్నారు. ఎక్కడ ఉన్న కూడా తెలంగాణ కోసం పాటు పడాలన్నారు. ఇచ్చిన సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని, కష్టపడిచదివి తెలంగాణ రుణం తీర్చుకొవాలని సీఎం రేవంత్ అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి