How To Apply Congress Six Guarantees: హామీలైతే ఇచ్చేశారు.. అమలు ఎలా చేయాలని ఆలోచిస్తున్నట్టుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి.. ఆరు గ్యారంటీలు అన్నీ సందేహాలే అన్నట్టుగా తయారైంది. ఈ పథకాల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి నుంచి మంత్రుల దాకా చేస్తున్న ప్రకటనలు అంతా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. దీంతో ప్రజల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది.
==> బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోకుండా మహాలక్ష్మి అమలు ఎలా..?
==> పురుషుల పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉంటే సబ్సిడీ వస్తుందా.. రాదా!
==> రేషన్ కార్డులు లేని వాళ్లు ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
==> పాత పెన్షన్‌దారులు మళ్లీ అప్లై చేసుకోవాలా.. వద్దా..?
==> రైతు బంధు లబ్దిదారులు రైతు భరోసాకు మళ్లీ దరఖాస్తు చేయాల్సిందేనా..?
==> రైతు భరోసాకు కటాఫ్ ఉందా.. వందల ఎకరాల వాళ్లు అప్లయ్ చేసుకోవాలా..? ఇలా ఇంకా ఎన్నో సందేహాలు ఇప్పుడు తెలంగాణ ప్రజలను వెంటాడుతున్నాయి. ఆరు గ్యారంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శల దాడి చేస్తోంది. ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలన్నదానిపై గందరగోళం నెలకొంది. ఎన్నికల సమయంలో ఏ విధంగా హామీలను అమలు చేస్తారో చెప్పలేదు. దాని విధివిధానాలు ఏంటో ఓ రోడ్ మ్యాప్ కూడా రూపొందించుకోలేదని తెలుస్తోంది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటన చేశారు.
గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ వరకు జనాల నుంచి ఆరు గ్యారంటీల దరఖాస్తులు తీసుకోనుంది ప్రభుత్వం. అయితే పథకాల లబ్దిదారుల విషయంలో పలు అనుమానాలు వస్తున్నాయి. దరఖాస్తులు ఎవరెవరు చేయాలి అన్నదానిపై అధికారుల నుంచి క్లారిటీ రావడం లేదు. గత ప్రభుత్వంలో పథకాలు పొందుతున్న వాళ్లు మళ్లీ అప్లయ్ చేసుకోవాలా.. లేక కొత్త వాళ్లే చేసుకోవాలా అన్నదానిపై జనాల్లో గందరగోళం నెలకొంది. రేషన్ కార్డు లేకుండా ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న దానిపైనా క్లారీటీ లేదు. గ్యాస్ సబ్సిడీ అందరికి వర్తిస్తుందా లేక మహిళలకేనా అన్న కన్ఫ్యూజన్ నెలకొంది.. హైదరాబాద్‌లో ఉన్న గ్రామీణులు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలన్న అంశంపైనా అధికారుల నుంచి సమగ్ర సమాచారం లేదన్న టాక్ వస్తోంది.
ఈ గ్యారెంటీలపై మంత్రులు కూడా ఒక్కో విధంగా స్పందిస్తుండటంతో ప్రజల్లో మరింత గందరగోళం నెలకొంది. ఇటీవల కలెక్టర్ల సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరు గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డునే ప్రాథమికంగా అర్హతగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. మరి రేషన్ కార్డుల గురించి ఎదురు చూస్తున్న వారి గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కొత్త కార్డులు ఇస్తామని చెప్పారు. వాటిని ఇచ్చాకే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంది.
Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
Also Read: Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter