Charminar Mosque Prayers Demand : చార్మినార్‌ మసీదులో ప్రార్థనలకు అనుమతివ్వాలని డిమాండ్

Charminar Mosque Prayers Demand : కుతుబ్ మినార్ వివాదం నడుమ, చార్మినార్‌ను తిరిగి ప్రార్థనల కోసం తెరవాలని కాంగ్రెస్ నాయకుడు డిమాండ్ చేస్తున్నారు. ఉద్రిక్తత సృష్టించే ప్రయత్నమని బీజేపీ ఆరోపిస్తోంది.

Written by - Sreedhar | Last Updated : Jun 1, 2022, 11:00 PM IST
  • చార్మినార్‌ మసీదులో ప్రార్థనలకు అనుమతివ్వాలని డిమాండ్
  • సంతకాల సేకరణ చేపట్టిన కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్
  • మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకేనని బీజేపీ ఆరోపణలు
Charminar Mosque Prayers Demand : చార్మినార్‌ మసీదులో ప్రార్థనలకు అనుమతివ్వాలని డిమాండ్

Charminar Mosque Prayers Demand : హైదరాబాద్‌లోని చార్మినార్‌ను ప్రార్థనల కోసం తెరవడానికి అనుమతించాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు సమావేశం నిర్వహించేందుకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో కొత్త వివాదానికి తెరలేసింది. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉన్న చార్మినార్‌లో గతంలో ప్రార్థనలు జరిగేవని, అయితే రెండు దశాబ్దాల క్రితం ఆ ప్రదేశంలో ప్రార్థనలు చేయకుండా ముస్లింలను నిషేధించారని కాంగ్రెస్ నాయకుడు రషీద్ ఖాన్ మంగళవారం పేర్కొన్నారు.

"ఇంతకుముందు చార్మినార్‌లో, ప్రజలు ప్రార్థనలు చేసేవారు. అయితే చార్మినార్‌ పై నుంచి దూకి ఒక వ్యక్తి ఆత్మహత్ చేసుకోవడంతో, ప్రార్థనలు నిలిపేశారు" అని మౌలానా అలీ క్వాద్రీ చెప్పారు.

దేశ రాజధానిలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో 27 హిందూ, జైన దేవాలయాల పునరుద్ధరణపై గొడవ కొనసాగుతున్న తరుణంలోనే ఈ డిమాండ్‌కు తెరలేచింది. గత నెలలోనే ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) ఢిల్లీ కోర్టులో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.

చార్మినార్ సమీపంలోని మసీదులో ప్రార్థనలకు సంబంధించి తాను సంతకాల సేకరణ ప్రారంభించానని ఖాన్ పేర్కొంటూ, ప్రార్థనలు చేయడానికి దానిని తెరవాలని ASI, పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు.

సాంస్కృతిక శాఖతో మాట్లాడినప్పుడు శాంతిభద్రతల సమస్య వస్తుందని కిషన్‌రెడ్డి అన్నారని, అందరి సంతకాలు తీసుకుని సెక్యులర్‌ తెలంగాణ సీఎం వద్దకు వెళతామని, వినతిని పరిష్కరించకుంటే ప్రగతి భవన్ ఎదుట నిరసన తెలుపుతామని ఖాన్ పేర్కొన్నారు. మసీదులపై దేశవ్యాప్తంగా తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారన్నారు ఖాన్.

చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం  అక్రమ నిర్మాణమని ASI నివేదికను ఉటంకిస్తూ వ్యాఖ్యానించారు. మేము గంగా జమునా తహజీబ్‌ను నమ్ముతాం. ఆలయంలో ప్రార్థనలు జరుగుతుంటే జరగనివ్వండి, కానీ అదే విధంగా మా మసీదుని తెరవాలి, మాకు నమాజ్‌కు అనుమతి ఇవ్వాలి అని అన్నారాయన. ASI మసీదును మూసివేస్తే, ఆలయాన్ని మూసివేయాలని ఖాన్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నాయకుడి సంతకాల ప్రచారంపై ఘాటుగా స్పందించిన బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావు.. హైదరాబాద్‌లో మత ఘర్షణలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని అన్నారు. నగరంలో కాంగ్రెస్ పార్టీ పతనమైందని అన్నారు.

“కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేని.. కేవలం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని మతపరమైన సమస్యలను లేవనెత్తడం ద్వారా వారు పార్టీ ప్రాబల్యాన్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని రామ్‌చందర్‌రావు ఆరోపించారు. 

చార్మినార్‌లో మసీదు ఉందని, అది వారసత్వ కట్టడమని, అది చాలా రోజుల క్రితమే మూసివేయబడిందని, అయితే ఆలయం కూడా ఉందని.. కొన్నేళ్లుగా అక్కడ ప్రజలు పూజలు చేస్తున్నారని రావు చెప్పారు.

రెండు అంశాలను ఒకే గాటన కట్టడం అంటే పాత నగరంలో "మత ఘర్షణలు" రెచ్చగొట్టే ప్రయత్నమేనని, దానిని "నేరం"గా పరిగణించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. నగరంలో మతకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అతడిని వెంటనే అరెస్టు చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించాలని రామ్‌చందర్‌రావు డిమాండ్ చేశారు.  టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మైనార్టీల మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

Also Read - ఈ ఆరుగురు హీరోయిన్స్‌కి తీవ్ర అనారోగ్య సమస్యలు.. నొప్పిని పంటి బిగువున భరిస్తూనే నటిస్తున్నారు!

Also Read - Shankar - Jr NTR: టాలీవుడ్‌లో మరో సెన్సేషనల్‌ కాంబో.. ఎన్టీఆర్‌తో శంకర్‌ సినిమా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News