Shankar - Jr NTR: టాలీవుడ్‌లో మరో సెన్సేషనల్‌ కాంబో.. ఎన్టీఆర్‌తో శంకర్‌ సినిమా!

Shankar planning his next movie with Jr NTR. ప్రస్తుతం టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో శంకర్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో ఓ మూవీ చేయబోతున్నాడట.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 1, 2022, 08:04 PM IST
  • టాలీవుడ్‌లో మరో సెన్సేషనల్‌ కాంబో
  • ఎన్టీఆర్‌తో శంకర్‌ సినిమా
  • భారతీయుడు 2 షూట్ కంప్లీట్ అయ్యాక
Shankar - Jr NTR: టాలీవుడ్‌లో మరో సెన్సేషనల్‌ కాంబో.. ఎన్టీఆర్‌తో శంకర్‌ సినిమా!

Director S Shankar plans next Telugu movie with Jr NTR: స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు. టెక్నాలజీ, సామాజిక అంశాలపై తనదైన స్టైల్లో సినిమాలు తీస్తూ  ప్రేక్షకులను మెప్పించడంలో దిట్ట. దక్షిణాది సినీ పరిశ్రమకు పాన్ ఇండియాకు పరిచయడం చేసింది కూడా శంకర్ అనడంలో అతిశయోక్తి లేదు. జీన్స్, ప్రేమికుడు, భారతీయుడు, జెంటిల్ మెన్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో, శివాజీ, ఐ సినిమాలు ఎంతటి ఘన విజయాలు సాధించాయో అందరికి తెలుసు. శంకర్ తెలుగులో ఇప్పటివరకు నేరుగా ఒక్క సినిమాక కూడా చేయలేదు కానీ టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏కు ఉన్న క్రేజ్ మాములుగా లేదు. 

ప్రస్తుతం టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో శంకర్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో ఓ మూవీ చేయబోతున్నాడట. ఈ మేరకు బడా నిర్మాత దిల్‌ రాజుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్‌ ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కేజీయఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో ఓ సినిమా ఒప్పుకున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన శంకర్‌తో ఎన్టీఆర్‌ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.

రామ్‌ చరణ్‌తో శంకర్‌ తెరకెక్కించే సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ పరిసరాల్లో జరుగుతోంది. అక్కడ చరణ్ పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి  ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు శంకర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. చరణ్ మూవీ తర్వాత కమల్ హాసన్‌తో భారతీయుడు 2 షూట్ కంప్లీట్ చేయనున్నాడు శంకర్. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. అటు శంకర్, ఇటు ఎన్టీఆర్‌ కాబట్టి ఈ ప్రాజెక్ట్ క్రేజ్ ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. 

Also Read: టాలీవుడ్ స్టార్ కమెడియన్ కూతురు సినీ ప్రవేశం.. హీరో ఎవరో తెలుసా?

Also Read: Recce Web Series: ZEE5 నుంచి మరో కొత్త వెబ్ సిరీస్‌.. జూన్ 17 నుంచి స్ట్రీమింగ్! తాడిపత్రి హత్య ఆధారంగా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News