Kadiyam Srihari: రాజయ్య అందుకే తొడలు కొడ్తాండు.. పంచులు కురిపించిన కడియం శ్రీహరి...

Kadiyam Srihari:కొన్నిరోజులుగా తాటికొండ రాజయ్య, కడియంశ్రీహరిపై అనేక విమర్శలు గుర్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా..ఎక్కడ సమావేశంలో పాల్గొన్న, ఏ వేదికపై ఉపన్యాసం చేసిన కూడా కడియంను ఏకీపారేస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై తాజాగా, కడియం శ్రీహారి రియాక్ట్ అయ్యారు.   

Written by - Inamdar Paresh | Last Updated : Apr 29, 2024, 05:06 PM IST
  • తాటికొండ రాజయ్య వట్టి అమాయకుడు..
  • బీఆర్ఎస్ అందుకే డబ్బులిస్తుందంటూ కామెంట్లు..
Kadiyam Srihari: రాజయ్య అందుకే తొడలు కొడ్తాండు.. పంచులు కురిపించిన కడియం శ్రీహరి...

Congress Leader Kadiyam Srihari Funny Comments On Thatikonda Rajaiah: ఎన్నికలు దగ్గరరపడుతున్న కొలది తెలంగాణ రాజకీయాలు సమ్మర్ హీట్ ను మరింత పెంచుతున్నాయి. అనేక పార్టీల నేతలు.. ఒకరిపై మరోకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నేతలు మాత్రం నువ్వా.. నేనా.. అన్న విధంగా ఒకరిపై మరోకరు ఫైర్ అవుతున్నారు. ఎంపీ ఎన్నికలలో వరంగల్ కడియం శ్రీహరి పార్టీని వదిలి వెళ్లడం తీవ్ర సంచలనంగా మారింది. మొదట్లో కడియం, రాజయ్య ఇద్దరుకూడా బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహారించేవారు. అంతేకాకుండా.. కేసీఆర్ గతంలో సీఎంగా ఉన్నప్పుడు తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎంగా కూడా నియమించారు.

Read More: Chennai Child Rescued: వావ్.. అందరూ కలిసి బుడ్డోడీని భలే కాపాడారు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..

కొన్నిరోజుల తర్వాత ఆయనపై ఆరోపణలు రావడంతో అనూహాంగా ఆ శాఖలను తొలగించడం జరిగింది. అప్పటి నుంచి కడియంశ్రీహారి, తన రాజకీయం స్టార్ట్ చేశాడంటారు. తాటికొండ రాజయ్యను అనుచరులను భయపెట్టే పనులు చేయడం, ఆయనవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుండేవారని చెబుతుంటారు. అయితే.. కడియంశ్రీహరి బీఆర్ఎస్ ఓడిపోగానే కొన్నిరోజులకే కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఆయనకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నత పదవులు,హోదా గౌరవం ఇచ్చిన కూడా ఆయన కాంగ్రెస్ లోకి పోవడం పట్ల కేసీఆర్ సైతం బాధపడ్డట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు..తాటికొండ రాజయ్య, కడియంపై అవకాశం దొరికినప్పుడల్లా మండిపడుతున్నారు.

కడియం పెద్ద అవకాశ వాదని,  ఆయన తన అవసరాలకు రాజకీయాలు చేస్తుంటానని మండిపడ్డారు. ప్రజల్లో సైతం..కడియం చేసినతప్పుపనులు తీసుకెళ్లడానికి తాటికొండ రాజయ్యడాన్సులు చేస్తు, పాటలు పడుతు, అనేక విధాలుగాప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంచేస్తున్నారు. అంతేకాకుండా.. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కడియంను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Read More: Wedding with Robo: లేడీ రోబోతో యువకుడి ప్రేమాయణం.. మూఢాల్లోనే పెళ్లి.. ఎక్కడో తెలుసా..?

ఇక.. తాజాగా దీనిపై కాంగ్రెస్ నేత కడియం స్పందించారు. నన్ను తిట్టడానికే రాజయ్యను నియమించుకున్నారంటూ ఆయన పంచులుకురిపించారు. అందుకే రాజయ్య.. డ్యాన్సులు చేస్తు, పాటలు పాడుతూ, తొడలు కొడుతూ తన మీద విమర్శలు చేస్తున్నారన్నారు. రాజయ్య వట్టి అమాయకుడని..ఇదేం తెలియకుండా తనపై లేని పోనీ ఆరోపణలు చేస్తున్నాడని కడియం శ్రీహరి తనదైన స్టైల్ లో పంచులు కురిపించారు.  ఇక ఇప్పుడు తెలంగాణలో దేవుళ్ల మీద సీఎం రేవంత్ ఓట్లు వేస్తు కొత్తనాటాకానికి తెరతీశానని హరీష్ రావు విమర్శించారు. ఒక వేళ ఆగస్టు 15 వరకు రుణమాఫీ, ఆరుగ్యారంటీల పథకంలను అమలు చేస్తే తన రాజీనామాను స్పీకర్ కు పంపుతానని, ఒక వేళ చేయకపోతే.. సీఎం రాజీనామాను గవర్నర్ కు సమర్పించాన్నారు. తెలంగాణ ప్రజలకు మంచి జరగడమే తమకు కావాల్సిందని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x