రేవంత్ రెడ్డి అరెస్ట్ తో వేడేక్కిన కొండగల్ రాజకీయం

ఈ రోజు తెల్లవారుఝమున తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు

Updated: Dec 4, 2018, 12:18 PM IST
రేవంత్ రెడ్డి అరెస్ట్ తో వేడేక్కిన కొండగల్ రాజకీయం

కోడంగల్‌లో తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వహక అధ్యక్షుడు  రేవంత్ రెడ్డికి ముందస్తు అరెస్ట్ చేశారు. ఈసీ ఆదేశాలతో ఈ మేరకు ఆయన్ను అరెస్ట్ చేశారు. మంగళవారం తెల్లవారుఝమున ఇంటిగేటు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, పలువరు అనుచరులను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. రేవంత్ ను జడ్చర్ల పోలింగ్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించినట్లు సమాచారం. కాగా రేవంత్ అరెస్ట్ నేపథ్యంలో కొండగల్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల నడుమ కేసీఆర్ కొండగల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ పర్యటనపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనేది వేచిచూడాల్సిందే. 

కోడంగల్ లో టెన్షన్.. టెన్షన్

ఇదిలా ఉండగా  రేవంత్‌  నివాసం వద్ద 100 మందికి పైగా పోలీసులను మోహరించారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 144 సెక్షన్‌ అమలవుతోంది. మరోవైపు నియోజకవర్గంలని పలువురు రేవంత్ అనుచరులను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.  9 మంది ద్వితియ శ్రేణి కాంగ్రెస్‌ నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 

అరెస్ట్ కు కారణం ఇదే..

తెలంగాణ ఆపధార్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ముందస్తు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల వేధింపులకు నిరసనగా రేవంత్ రెడ్డి మంగళవారం కొండంగల్ బంద్ కు పిలపునిచ్చారు. మంగళవారం జరిగే కేసీఆర్ ప్రచారాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ అభిమానులంతా బంద్‌లో పాల్గొనాలని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రేవంత్‌రెడ్డిని ముందస్తు అదుపులోకి తీసుకున్నారు. 

రేవంత్ రెడ్డి భార్య గీతా రియాక్షన్
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి భార్య గీతా స్పందిస్తూ  తన భర్తను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. తెల్లవారు ఝామున 3 గంటల పసమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించారని విమర్శించారు. ఓటమి భయంతోనే కేసీఆర్ ఇలాంటి పిరికి చేష్టాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి సమయంలో  సంయమనం పాటించాలని రేవంత్ అభిమానులు, కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ రియాక్షన్..
రేవంత్ అరెస్ట్ పై టి.పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ  రేవంత్ అరెస్ట్ అప్రజాస్వామికమని..ఇది పిరికి పందెల చర్యల అంటూ అరెస్ట్ ను ఖండించారు. ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తోందని విరమ్శించారు. టీఆర్ఎస్ అధికార దుర్వినయోగానికి పాల్పడుతోందన్న ఉత్తమ్.. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరని పేర్కొన్నారు