Telangana Corona Cases: భారీగా తగ్గిన కరోనా కేసులు.. తెలంగాణలో ఎన్నంటే..?

Corona Cases Today In India: కరోనా కేసులు తగ్గముఖం పట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా ఒక్కసారిగా పెరిగిన కోవిడ్ కేసులు.. క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తెలంగాణ 40 కేసులు నమోదవ్వగా.. దేశవ్యాప్తంగా 4,282 కేసులు నమోదయ్యాయి.  

Written by - Ashok Krindinti | Last Updated : May 1, 2023, 12:56 PM IST
Telangana Corona Cases: భారీగా తగ్గిన కరోనా కేసులు.. తెలంగాణలో ఎన్నంటే..?

Corona Cases Today In India: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా  87,038 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4,282 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 6,037 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 47,246 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 40 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ మరణాలు నమోదు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 99.47 శాతంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.87 కోట్ల కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. అందులో 8.43 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది. కరోనా నుంచి మొత్తం 8.39 లక్షల మంది కోలుకున్నారు. కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

Also Read: Rohit Sharma Birthday: రోహిత్ శర్మ బర్త్‌ డేకు హైదరాబాద్ ఫ్యాన్స్ స్పెషల్ గిఫ్ట్.. 60 అడుగుల భారీ కటౌట్.. కోహ్లీని మించి..!  

Also Read: MI Vs RR Highlights: రోహిత్ శర్మకు అన్యాయం.. ఔట్ కాకున్నా పెవిలియన్‌కు.. వీడియో వైరల్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News