Telangana: తెలంగాణలో 943కి చేరిన కరోనా కేసులు

తెలంగాణలో బుధవారం కొత్తగా మరో 15 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. నేడు గుర్తించిన 15 కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య మొత్తం 943కి చేరింది. అందులో 725 మంది రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

Last Updated : Apr 22, 2020, 09:35 PM IST
Telangana: తెలంగాణలో 943కి చేరిన కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో బుధవారం కొత్తగా మరో 15 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. నేడు గుర్తించిన 15 కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య మొత్తం 943కి చేరింది. అందులో 725 మంది రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు మరో 194 మంది కరోనావైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 24 కు చేరింది.

 

Trending News