Telangana Planning To One Card One State: ఒక కార్డు ఒక రాష్ట్రం పేరిట తెలంగాణ సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. రేషన్ కార్డుతోపాటు హెల్త్ ప్రొఫైల్ అన్నిటినీ ఒకే కార్డు తీసుకురావాలని యోచిస్తోంది.
India Covid: భారత్ లో కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నిన్నటితో పోల్చితే కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కచ్చితంగా మాస్క్ లు ధరించాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.
CM Jagan: వైద్యారోగ్యశాఖలో పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 14,200 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. నవంబరు 15 నాటికి పోస్టులను భర్తీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Covid19 vaccination: కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది. హైదరాబాద్‌లో వ్యాక్సిన్ పంపిణీకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరిలో వ్యాక్సిన్ అందుబాటులో రానుండటంతో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. హైదరాబాద్‌లో ఎవరికి ముందుగా వ్యాక్సిన్ వేయనున్నారంటే..
COVID-19 cases in AP | అమరావతి: ఏపీ వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు (Good news to unemployed). ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వెంటనే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ( Job notification) ఇవ్వాల్సిందిగా ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి చెప్పారు.
భారత్‌లో కరోనా వైరస్‌ను నియంత్రించే దిశగా సరైన చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి టెక్నాలజీ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ బుధవారం ఓ లేఖ రాశారు.
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బుధవారం నాడు కొత్తగా 1,486 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20,471కు చేరుకుంది. గత 24 గంటల్లో 49 మంది కరోనాతో చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనావైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 652కి చేరింది.
తెలంగాణలో బుధవారం కొత్తగా మరో 15 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. నేడు గుర్తించిన 15 కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య మొత్తం 943కి చేరింది. అందులో 725 మంది రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
మే3న ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసినా.. ఆ తర్వాత కూడా హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌పై అక్టోబర్ 15 వరకు లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. స్వయంగా కేంద్ర పర్యాటక శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఉన్న ఓ సర్కులర్ కూడా ఆ వార్తతో పాటే వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఈ పుకార్లపై స్పందించిన పర్యాటక శాఖ.. ఆ వార్తలో నిజం లేదని కొట్టిపారేసింది. ఆ సర్కులర్ తాము విడుదల చేయలేదని కేంద్ర పర్యాటక శాఖ వెల్లడించింది.
కరోనావైరస్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 1,553 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా సోకి 36 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. సోమవారం సాయంత్రం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ దేశంలో కరోనా లేటెస్ట్ అప్డేట్స్ని మీడియాకు వెల్లడించారు
ఏపీలో శనివారం నాడు 24 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 405కు చేరుకుంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు నమోదైన 24 కరోనా పాజిటివ్ కేసుల్లో అధిక భాగం గుంటూరు జిల్లాలోనే వెలుగుచూడటం గమనార్హం.
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రతలో కొంత మార్పు కనిపిస్తోంది. ఏపీలో బుధవారం 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా గురువారం 15 పాజిటివ్ కేసులు రావడం కొంత ఉపశమనాన్నిస్తోంది. మొదట్లో భారీగా నమోదైన పాజిటివ్ కేసులు గత రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతుండటాన్ని పరిశీలిస్తే.. పరిస్థితిలో మార్పు కనిపిస్తున్నట్టే అనిపిస్తోంది అని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో ఏప్రిల్ 8, బుధవారం నాడు కూడా భారీ సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. బుధవారం కొత్తగా మరో 49 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనావైరస్ సోకిన వారి మొత్తం సంఖ్య 453కు చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
ఏపీలో జిల్లాల వారీగా బుధవారం వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాల విషయానికొస్తే... అనంతపురంలో -13, చిత్తూరులో 20, తూర్పు గోదావరి జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో -49, కడప జిల్లో 28, కృష్ణా జిల్లాలో -35, కర్నూలు జిల్లాలో 75, నెల్లూరులో 48, ప్రకాశం జిల్లాలో 27, విశాఖపట్నంలో 20, పశ్చిమ గోదావరి -22 కేసులు నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు విషయంలో గత రెండు, మూడు రోజుల నుండి ఉన్న పరిస్థితితో పోల్చుకుని చూస్తే.. ఏప్రిల్ 7న మంగళవారం నాటి పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్టు కనిపించింది.
లాక్ డౌన్ తర్వాత కూడా కరోనావైరస్ ప్రభావం అధికంగా ఉన్న హాట్ స్పాట్స్ ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి అన్నారు. మర్కజ్ వెళ్లి వచ్చిన వారితో పాటు వాళ్ల సంబంధీకులకు కలిపి సుమారు 3,500 మంది శాంపిళ్లు సేకరించి కోవిడ్ పరీక్షలకు పంపించామని ఆయన తెలిపారు.
కరోనా వైరస్ నివారణ గురించి ప్రధాని నరేంద్ర మోదీకి పలు సలహాలు, సూచనలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం ఓ లేఖ రాశారు.అప్పుడే దేశం కరోనావైరస్పై సమర్థవంతంగా పోరాడగలదని ఆమె స్పష్టంచేశారు.
కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులలో డాక్టర్ల పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా ఉందనడానికి అద్దంపట్టేలా ఉంది ఈ వీడియో. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న యువ లేడీ డాక్టర్ అంబిక తన వ్యక్తిగత అనుభవాన్ని, ప్రస్తుతం తాను గురవుతున్న మనోవేధనను తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చిత్తశుద్ధితో సేవలు అందిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, మున్సిపల్, పంచాయతీ కార్మికులు అలాగే జీహెచ్ఎంసి, హెచ్ఎండబ్లూఎస్ విభాగాల సిబ్బందికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వివిధ రూపాల్లో గుడ్ న్యూస్ అందించారు.
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ను కంట్రోల్ చేయడం కోసం 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం పడిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.