Dalit Bandhu: మరో 500 కోట్ల రూపాయలు విడుదల చేసిన సీఎం కేసీఆర్

ఉప ఎన్నికల కారణంగా హుజురాబాద్‌ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు. రెండో విడతగా 500 కోట్ల రూపాయల దళితబందు విధుల చేసిన కేసీఆర్ మరో వారం రోజుల్లో మిగిలిన 2000 కోట్ల రూపాయలు విడదల చేస్తామని తెలిపారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 23, 2021, 12:45 PM IST
  • హుజురాబాద్‌ పై వరాల జల్లు కురిపించిన కేసీఆర్
  • మరో 500 కోట్ల రూపాయలు విడుదల
  • మరో వారం రోజుల్లో మిగిలిన 1000 కోట్ల రూపాయల విడుదల
Dalit Bandhu: మరో 500 కోట్ల రూపాయలు విడుదల చేసిన సీఎం కేసీఆర్

Dalit Bandhu Scheme: తెలంగాణ రాష్ట్రం చూపు.. హుజురాబాద్‌‌‌ వైపే. జరగబోయే ఉప ఎన్నికల్లో (Huzurabad Byelections) ఎవరు గెలుస్తారు.. ప్రజలు ఎవరికీ పట్టం కడతారు?? తెరాస తరపున వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటెల (Etela Rajender BJP) ఈ సారి బీజేపీ తరపున పోటీ చేస్తుండగా, తెరాస గెల్లు శ్రీనివాస్ (Gellu srinivas yadav TRS) పోటీ చేయనున్నారు. 

ఉప ఎన్నికల కారణంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌ (Huzurabad) నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయగా.. హుజూరాబాద్ లో సభ అనంతరం ఈ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ. 2000 కోట్ల నిధులు విడుదల చేస్తామని తెరాస ప్రభుత్వం (TRS Government) ప్రకటించింది.

Also Read: Shocking News: ఆత్మహత్య చేసుకున్న "కాంచన-3" సినిమా హీరోయిన్

దళితబంధు పథకం (Dalit Bandhu Scheme) పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న కరీంనగర్ జిల్లా (Karimngar) హుజూరాబాద్ నియోజకవర్గానికి ఇదివరకే 500 కోట్ల రూపాయలు విడుదల చేసిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం మరో రూ. 500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే రూ. 2000 కోట్లలో రూ. 1000 కోట్లు నిధులు విడుదలయ్యాయి. మిగిలిన వెయ్యి కోట్లు రూపాయలు వచ్చే వారం రోజుల్లో విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు

కాగా... ఉప ఎన్నిక కారణంగా.. హుజురాబాద్‌ లో పైలట్ ప్రాజెక్టు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ.. రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ (EC)తో పాటు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీ (Telangana Congress Party), భాజపా (Telangana BJP party), సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (CM KCR) తదితరులను పిటిషనర్లు ప్రతివాదులుగా చేర్చారు. 

Also Read: Interest Free Credit Card: వడ్డీ లేకుండానే క్రెడిట్ కార్డు, ఎలాగో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News