Suicide Case: ఎనిమిదేళ్ల సహజీవనం.. 14 సార్లు బలవంతపు అబార్షన్.. తీరా పెళ్లికి నో చెప్పడంతో మహిళ ఆత్మహత్య..

Delhi Woman Suicide Case: 8 ఏళ్ల సహజీవనం.. 14 సార్లు బలవంతపు అబార్షన్.. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన వ్యక్తి దారుణంగా మోసం చేయడంతో మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.   

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 15, 2022, 02:04 PM IST
  • ఢిల్లీలో షాకింగ్ సంఘటన
  • 33 ఏళ్ల మహిళ ఆత్మహత్య
  • 14 సార్లు బలవంతపు అబార్షన్ చేయించిన ప్రియుడు
  • పెళ్లికి నిరాకరించడంతో మహిళ ఆత్మహత్య
Suicide Case: ఎనిమిదేళ్ల సహజీవనం.. 14 సార్లు బలవంతపు అబార్షన్.. తీరా పెళ్లికి నో చెప్పడంతో మహిళ ఆత్మహత్య..

Delhi Woman Suicide Case: ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. జైత్‌పూర్ ప్రాంతంలో ఇటీవల 33 ఏళ్ల ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ నోట్‌లో ఆత్మహత్యకు సంబంధించి ఆమె వెల్లడించిన కారణం అందరినీ షాక్‌కి గురిచేసేలా ఉంది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తనతో సహజీవనం చేసిన వ్యక్తి.. 14 సార్లు తనకు బలవంతపు అబార్షన్ చేయించినట్లు మృతురాలు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. తీరా తనను పెళ్లి చేసుకోవడానికి అతను నిరాకరించడంతో.. తీవ్ర మనోవేదనతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది.

ఢిల్లీలో జూలై 5న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతురాలు తన భర్తతో విడిపోయి మరో వ్యక్తికి దగ్గరైంది. నోయిడాలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే ఆ వ్యక్తితో ఏడేనిమిదేళ్లుగా సహజీవనం చేస్తోంది. అతను పెళ్లి చేసుకుంటానని మాటివ్వడంతో ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. అలా ఆ మహిళ 14 సార్లు గర్భం దాల్చగా.. బలవంతంగా అతను అబార్షన్ చేయించాడు.

ఇన్నేళ్ల సహజీవనం తర్వాత ఇటీవల అతను ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆమె ఇక తనకు చావు తప్ప మరో మార్గం లేదని భావించి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యపై పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో సూసైడ్ నోట్‌ను గుర్తించారు. 14 సార్లు బలవంతపు అబార్షన్లు చేయించి.. తీరా పెళ్లికి నిరాకరించడం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాధితురాలు అందులో పేర్కొంది.

ఆత్మహత్యపై బీహార్‌లోని ముజఫర్‌నగర్‌లో ఉంటున్న ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమె భర్తను విచారణ నిమిత్తం పిలవగా.. ఆమెతో ఎనిమిదేళ్లుగా తనకెటువంటి సంబంధం లేదని అతను వెల్లడించినట్లు చెప్పారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 376 (రేప్), 313 (బలవంతపు గర్భస్రావం) ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: Bhadrachalam Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి డేంజర్ బెల్స్.. ఈ మధ్యాహ్నం 3 గంటలకు 73 అడుగులకు చేరుతుందని అంచనా

Also Read: Kiraak RP Jabardasth: కిరాక్ ఆర్పీ సినిమా అందుకే ఆగింది.. అసలు ఫ్రాడ్ బయటపెట్టిన ఏడుకొండలు

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News