Bhatti Vikramarka House Theft: తెలంగాణలో భారీ దొంగతనం జరిగింది. ఏకంగా ఉప ముఖ్యమంత్రి నివాసంలోనే చోరీ జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విదేశాల్లో మల్లు భట్టి విక్రమార్క ఉండడంతో ఇదే అదునుగా భావించి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దుండగులను విస్తృతంగా గాలించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్‌లో నిందితులు పట్టుబట్టారు.
Also Read: ED Raids: తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్‌షాక్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నివాసం ఉంది. అయితే అధికారిక నివాసం ప్రజాభవన్‌తోపాటు ఇక్కడ కూడా భట్టి విక్రమార్క నివసిస్తున్నారు. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలోనే దొంగలు ఇంట్లోకి చొరబడి భారీగా నగదు, బంగారు, వెండి ఆభరణాలు తస్కరించారు. ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు వెంటనే భట్టికి సమాచారం ఇచ్చారు. అయితే ఆయన వెంటనే పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని ఏడో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై జీఆర్‌పీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం విషయాన్ని బయటకు కక్కారు. నిందితులు బిహార్‌కు చెందిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్‌గా గుర్తించారు. వారి నుంచి 2.2 లక్షల నగదు, వంద గ్రాముల బంగారు నాణెం, విదేశీ కరెన్సీ నోట్లు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌లో కేసు నమోదవగా నిందితులను ఖరగ్‌పూర్ కోర్టులో హాజరుపరచనున్నారని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.