Telangana DA Announcement: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు డీఏ చెల్లించే విషయమై ఉద్యోగ సంఘాలతో చర్చలు సానుకూలంగా పూర్తయ్యాయి. మొత్తం ఐదు డీఏలు పెండింగులో ఉండగా ప్రస్తుతం ఒక డీఏ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
తెలంగాణ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు ఫలప్రదమౌతున్నాయి. ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. దీపావళి పురస్కరించుకుని ఉద్యోగులకు ఒక డీఏ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగ సంఘాలతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జరిపిన చర్చలు ముగిసాయి. మొత్తం ఐదు పెండింగు డీఏలు ఉంటే అందులే ఒక డీఏ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా లభించనుంది. 2022 జనవరి నాటి డీఏ చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అదే విషయాన్ని ఉద్యోగ సంఘాల భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Also read: Electricity Charges: డిసెంబర్ నుంచి ఏపీలో భారీగా పెరగనున్న విద్యుత్ ఛార్జీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.