Dk Shivakumar: వేర్ ఈజ్ డీకే శివకుమార్.. సైలెంట్ అవ్వడానికి కారణాలు!

Dk Shivakumar: డీకే శివకుమార్ పరిచయం పెద్దగా అక్కర్లేదు.. అయితే రాజకీయాల పరంగా ఆయన పేరు ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యింది. ఇంతకీ ఆయన ఎక్కడున్నారు.? ఇంత సైలెంట్ గా ఉండడానికి కారణాలేంటి.. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Aug 19, 2024, 04:10 PM IST
Dk Shivakumar: వేర్ ఈజ్ డీకే శివకుమార్.. సైలెంట్ అవ్వడానికి కారణాలు!

Dk Shivakumar: తెలంగాణ ఎన్నికల ముందు అంతా తానే అన్నట్లుగా వ్యవహరించారు. చేరికల నుంచి టికెట్ల వరకు తన చుట్టే రాజకీయాన్ని తిప్పుకున్నారు. పక్క రాష్ట్రమైనా తెలంగాణ నేతలకన్నా చాలా పవర్ ఫుల్ గా మారారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కూడా మంత్రి పదవులు ఇతర ముఖ్య విషయాల్లో కూడా చాలా చురుకుగా ఉన్నారు. ఉన్నట్లుండి ఆ లీడర్ సైడ్ అవడంతో పాటు సైలెంట్ కూడా అయ్యారు. ఆ లీడర్ సైడ్ తనకు తానే సైడ్ అయ్యారా లేకుంటే ఎవరైనా సైడ్ చేశారా..

డీకే శివ కుమార్ తెలంగాణ రాజకీయాలకు పరిచయం అవసరం లేని పేరు. కర్ణాటకలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ పొలిటిషియన్. కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత ఆప్తుడు.  కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకీ ఆర్థికంగా అండదండగా ఉంటూ వచ్చారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా డీకే అక్కడ వాలిపోయిన పరిస్థితి ఉండేది. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల్లో పార్టీకీ ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. ఇదే క్రమంలో దేశ వ్యాప్తంగా మోదీ, బీజేపీ హవా కొనసాగుతుంది. ఇదే సమయంలో కర్ణాటకలో ఎన్నికలు వచ్చాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అంత వరకూ కర్ణాటకలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఎన్నికల్లో కూడా మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని అందరూ అనుకున్నారు. కాంగ్రెస్ మాత్రం  శక్తివంచన లేకుండా ఎన్నికల్లో పోరాడడానికి సిద్దమైంది. అయితే కర్ణాటక ఎన్నికల భారాన్ని మొత్తం  మోసింది డీకే శివకుమార్ అని చెప్పకతప్పదు. డీకే అండతో పాటు సిద్దిరామయ్య రాజకీయ ఛరిష్మాతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. దీంతో డీకే శివకుమార్ పేరు మరింత మారు మోగింది. డీకే ఎంటరైతే వార్ వన్ సైడే అన్నట్లుగా పాలిటిక్స్ మారుతాయని రుజువు చేసుకున్నారు.

అలాంటి డీకే శివకుమార్ కు కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక ఎన్నికల తర్వాత మరో పెద్ద టాస్క్ ను అప్పగించింది. తెలంగాణ ఎన్నికల్లో డీకే కు కీ రోల్ ఇచ్చింది. ఒక వైపు అప్పటికే అధికార బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపుతో పాటు ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ఇదే సమయంలో ఇక్కడకు డీకే ఎంటరయ్యారు. డీకే ఎంటరవుతూనే ఎన్నికల ప్రచారంతో పాటు టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఖర్చుల విషయంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు. ఒక విధంగా చెప్పాలంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఐనా ఎన్నికల సమయంలో మాత్రం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలన్నీ డీకే చుట్టే తిరిగాయి. టికెట్ల కేటాయింపులో డీకేదే కీలక పాత్ర. టికెట్లు దక్కని వారిని కూడా డీకే ఏదో ఒక రకంగా మేనేజ్ చేశారు. ఒక దశలో డీకే బెంగళూరులో ఉన్నా అక్కడికి వెళ్లి మరీ కాంగ్రెస్ నేతలు కలవడం మొదలుపెట్టారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్న ముఖ్య నేతలు అంతా కూడా బెంగళూరులో డీకే అనుమతితోనే జరిగింది అని చెప్పవచ్చు.

ప్రస్తుతం కాంగ్రెస్ కేబినెట్ లో కీలక మంత్రులుగా ఉన్న తుమ్మల, పొంగులేటి తో పాటు చాలా మంది ముఖ్య నేతలు సైతం అప్పట్లో డీకేను అపాయింట్ కోసం వేచి చూసిన వాళ్లే. చివరకు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సైతం కొన్ని కీలక అంశాలపై చర్చించడానికి పలు సందర్బాల్లో బెంగళూరుకు వెళ్లారంటే డీకే అప్పట్లో ఎంత పవర్ పుల్ గా మారారో చెప్పవచ్చు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి ప్రచార షెడ్యూల్ ను సైతం డీకేనే ఫైనల్ చేశారని చెబుతారు. ఎన్నికల ప్రచారం మొదలుకొని పోలింగ్ వరకు అన్నీ తానై డీకే చూసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలతో పాటు డీకే అండదండలతో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత దశాబ్దకాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో డీకేదీ కీలక పాత్ర అని చెప్పకతప్పదు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కూడా కొద్ది రోజుల వరకు డీకే ఆక్టివ్ గా ఉండేవారు. మంత్రి పదవుల విషయంలో కూడా డీకే ఇన్వాల్వ్ మెంట్ ఉండేది. అలాంటి డీకే ఇప్పుడు మాత్రం తెలంగాణ వైపు  మాత్రం తొంగి చూడడం లేదు. ఇప్పుడు ఇదే అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అసలు డీకే శివకుమార్ కు ఏమైంది. ఎందుకు సడన్ గా సైలెంట్ అయ్యారు. తెలంగాణ వైపు ఎందుకు రావడం లేదు. అనే చర్చ గాంధీ భవన్ లో జరుగుతుంది. కొంత మంది డీకే శివకుమార్ ను సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ అంతగా ఆసక్తి చూపలేదని చెబుతున్నారు. తెలంగాణకు ఈ మధ్య డీకే ఎందుకు రావడం లేదనే విషయం ఆరా  తీస్తే కర్ణాటక రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్నారని ఆయన అనచరవర్గం చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఎన్నికల టాస్క్ అప్పగించింది. దానిని మా నాయకుడు సక్సెస్ పుల్ గా పూర్తి చేశారు. తర్వాత పూర్తిగా కర్ణాటక రాజకీయాల మీదే దృష్టి పెట్టారనేది డీకే పాలోవర్స్ చెబుతున్నారు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

అయితే ఇది ఇలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ లో మరొక చర్చ కూడా ఉంది. ఎన్నికల వరకు అంటే సరే కానీ ప్రభుత్వం ఏర్పాడ్డాక కూడా డీకే ఇన్వాల్వ్ మెంట్ మరీ ఎక్కువైందని . దీంతో తెలంగాణ కాంగ్రెస నేతలు అధిష్టానం దృష్టికి తెచ్చారట. డీకే ఇలాగే తెలంగాణకు సంబంధించిన అన్ని విషయాల్లో వేలు పెడితే అతను మరోపవర్ సెంటర్ గా మారుతారని అది పార్టీకీ తీవ్రంగా నష్టం చేకూర్చుతుందని కాంగ్రెస్ పెద్దలకు చెప్పారట. తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పిన అంశంతో ఢిల్లీ పెద్దలు కూడా ఏకీభవించారట. దశాబ్దం తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వస్తే దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ అనీ అధిష్టానం భావనట. ఏ చిన్న పొరపాటు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందుల తప్పని గ్రహించిన అధిష్టానం డీకేను కర్ణాటకకు మాత్రమే పరిమితం చేసింది. తాము చెప్పేంత వరకు తెలంగాణ రాజకీయాల జోలికి వెళ్లవద్దని డీకేకు సూచించిందట. ఇదే సందర్భంలో డీకే కూడా కర్ణాటక రాజకీయాల్లో పూర్తిగా దృష్టిపెట్టాలని నిర్ణయించారు. దీంతో తెలంగాణ పాలిటిక్స్ నుంచి డీకే కొంత కాలంగా సైడ్ అయ్యారనేది గాంధీ భవన్ వర్గాల టాక్.

మొత్తానికి ఎన్నికల ముందు చక్రం తిప్పిన డీకే శివకుమార్ ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్నారు. తన అవసరం వచ్చిందంటే మాత్రం తప్పక తన ఎంట్రీ తెలంగాణ పాలిటిక్స్ లో ఉంటుందని డీకే చెబుతున్నారు. భవిష్యత్తులో డీకే మళ్లీ తెలంగాణ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తారా లేదో వేచి చూడాలి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News