Revanth Reddy Vulgar: 'శాతగానోనికి మాటలెక్కువ.. చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లు రేవంత్ రెడ్డి పరిస్థితి అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ సభ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన అసభ్య.. రాయలేని రీతిలో చేసిన వ్యాఖ్యలపై మళ్లీ ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి పదవిలో ఉండీ వీధి రౌడీలా అతడు చేసిన వ్యాఖ్యలపై ప్రజలతోపాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అతడి మాటలను ఖండించారు. అతడి పాపం పోదని.. దుర్బాషను ప్రజల విచక్షణకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు.
'పదకొండు నెలల పాలనలో ఆయన నోటి నుంచి బూతులు తప్ప నీతులు రాలేదు. కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకొని చేసింది ఏమీ లేక.. చెప్పుకోవడానికి ఏమీ లేక ఎప్పటి లాగే పిచ్చి మాటలు వదిలిండు' అని హరీశ్ రావు తెలిపారు. 'ఇక నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా.. రైతుల నుంచి లంబాడీ బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపోవు. తెలంగాణ ప్రజలు మరిచిపోరు' అని వివరించారు.
Also Read: Lagacharla: రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగుల షాక్.. లగచర్ల ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు
' కేసీఆర్.. కేసీఆర్ అంటూ కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి నీ పాపం పోదు. కేసీఆర్ వంటి గొప్ప వ్యక్తి జీవితంలో అర్థం కాడు' అని పేర్కొన్నారు. 'తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చానని గప్పాలు కొడుతున్నావు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులను తొక్కినవు. షార్ట్ కట్లో అధికారం చేజిక్కించుకొని ప్రజలను తొక్కుతున్నావు' అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నీ వదురుబోతు తనంతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు. నీ దుర్భాషను ప్రజల విచక్షణకే వదిలేస్తున్నాం' అని తెలిపారు. కాగా తన తండ్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తిప్పి కొట్టనున్నారు. బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి రేవంత్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇస్తారని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.