Donthi Madhava Reddy vs Revanth Reddy: అధికారంలో ఉన్నా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నట్టు కనిపిస్తోంది. అధికారం ఉంది కదా అని కోపతాపాలు పక్కకుపెట్టి వెళ్తారనుకుంటే మరింత విభేదాలు ముదురుతున్నాయి. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒరిజినల్ నాయకులు ఇంకా అసంతృప్తితోనే ఉన్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి పర్యటనకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతున్నారు. ఏడాది పాలన సంబరాల పేరిట చేస్తున్న హడావుడిలో ఓ ఎమ్మెల్యే గైర్హాజరయ్యాడు. ఇలా ఒక్కసారి కాదు ముచ్చటగా మూడుసార్లు రేవంత్ రెడ్డికి షాకిచ్చాడు. తాజాగా వరంగల్ పర్యటనలో రేవంత్ పర్యటనకు అధికార పార్టీ ఎమ్మెల్యే హాజరుకాలేదు. ఈ వ్యవహారం ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది.
Also Read: Lagacharla: రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగుల షాక్.. లగచర్ల ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు
ఏడాది పాలన సంబరాల పేరిట రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా వరంగల్‌లో పర్యటించారు. వరంగల్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమాల్లో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. కానీ ఎడమొహం పెడమొహం పెట్టారు. సీఎం పర్యటన కావడంతో తప్పక హాజరయ్యారు కానీ ఆ నాయకుల మధ్య తీవ్ర విబేధాలు ఉన్నాయి. కొండా సురేఖ, కడియం శ్రీహరి, గుండు సుధారాణి తీరుపై ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు తీవ్ర కోపంతో ఉన్నారు.
Also Read: GO 16 Cancel: తెలంగాణ ఉద్యోగులకు భారీ షాక్.. జీవో 16 రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు
ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్
మొదటి నుంచి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉన్నారు. అధికారంలోకి వచ్చాక కూడా అతడి వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి మూడుసార్లు వరంగల్ జిల్లాలో పర్యటించినా దొంతి మాధవ రెడ్డి మాత్రం ఆ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ముఖ్యమంత్రి పదవికి కూడా మాధవరెడ్డి గౌరవం ఇవ్వలేదు. కాగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటనలో మాత్రం మాధవరెడ్డి పాల్గొనడం విశేషం.
రేవంత్ పై వ్యతిరేకత
ఈ వ్యవహారం చూస్తుంటే రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యతిరేకతతో ఉన్నారని అర్థమవుతోంది. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పట్టించుకోకపోవడం.. రేవంత్ దూకుడుతనంపై మాధవరెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సీతక్క, కొండా సురేఖ, కడియం కావ్య వంటి వారిపై కూడా ఆయన కోపంతో ఉన్నారని చర్చ జరుగుతోంది. ముచ్చటగా మూడోసారి కూడా రేవంత్ రెడ్డి పర్యటనకు మాధవరెడ్డి రాకపోవడం ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. పార్టీ అధిష్టానం.. రేవంత్ వైఖరిపై ఆయన ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ ఆగ్రహం ఏ రూపంలో బయటకు వస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.