Birthday Wishes: మనసు నిండా అభిమానముంటే కొలిచేందుకు హద్దులుండవు. కొంతమంది ఆ హద్దుల్ని దాటి మరీ అభిమానం ప్రదర్శిస్తుంటారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అభిమానుల జన్మదిన శుభాకాంక్షలివి..
కొందరి అభిమానానికి హద్దే ఉండదు. తాము ఆరాధించే వ్యక్తిపై ఉన్న అభిమానాన్ని ఆకాశం అంత ఎత్తులోనూ..సముద్రమంత లోతులోనూ ప్రదర్శించాలని భావిస్తూ ఉంటారు. తాజాగా తమ ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కొందరు అభిమానులు. ఊరంతా తెలిసేలా గగనతలంపై చాపర్ ద్వారా బర్త్‌డే విషెస్ తెలిపాడో అభిమాని.
దేశ రాజధాని ఢిల్లీ నగర శివార్లలో గగనతలంపై ప్రత్యేక చాపర్ ద్వారా తెలంగాణ జాగృతి సెక్రటరీ రోహిత్ రావు ఎమ్మెల్సీ కవితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు . ప్రత్యేక చాపర్‌కు హ్యాపీ బర్త్‌డే కవితక్క అని రాసి ఉన్న ఫ్లెక్సీని కట్టి నగరమంతా చూసేలా ఎగరవేశారు.
ఇక నిజామాబాద్‌కు చెందిన చిన్ను గౌడ్ మహాబలేశ్వర్ ఆలయం సమీపంలో అరేబియా మహాసముద్రంలో పది పడవలపై ఎమ్మెల్సీ కవిత ఫోటోలతో కూడిన గులాబీ రంగు జెండాలను ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపాడు.
Also read: Hyderabad Press Club Elections: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు.. 'ఇండిపెండెంట్ ప్యానెల్' మేనిఫెస్టో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook