Hyderabad Press Club Elections: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు.. 'ఇండిపెండెంట్ ప్యానెల్' మేనిఫెస్టో

Hyderabad Press Club Elections: హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్ ఎన్నికలు ఆదివారం అట్టహాసంగా జరగనున్నాయి. జర్నలిస్టులు మాత్రమే సభ్యులుగా ఉండే ప్రెస్‌క్లబ్‌లో ప్రధానంగా మూడు ప్యానెళ్లు పోటీ పడుతున్నాయి. ఎవరికి వారు తమ ప్యానెల్‌ను గెలిపించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇండిపెండెంట్‌ ప్యానల్‌ తరపున అధ్యక్షుడిగా సతీష్ కమాల్‌, ఉపాధ్యక్షుడిగా మేకల కృష్ణ, ప్రధాన కార్యదర్శి పదవికి పీవీ శ్రీనివాస్‌ పోటీ పడుతున్నారు.

Last Updated : Mar 12, 2022, 10:48 PM IST
  • మార్చి 13న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు
  • ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు ప్రయత్నాలు
  • ఇండిపెండెంట్‌ ప్యానెల్ అభ్యర్థుల జాబితా, మేనిఫెస్టో వివరాలు
Hyderabad Press Club Elections: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు.. 'ఇండిపెండెంట్ ప్యానెల్' మేనిఫెస్టో

Hyderabad Press Club Elections: హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్ ఎన్నికలు ఆదివారం అట్టహాసంగా జరగనున్నాయి. జర్నలిస్టులు మాత్రమే సభ్యులుగా ఉండే ప్రెస్‌క్లబ్‌లో ప్రధానంగా మూడు ప్యానెళ్లు పోటీ పడుతున్నాయి. ఎవరికి వారు తమ ప్యానెల్‌ను గెలిపించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇండిపెండెంట్‌ ప్యానల్‌ తరపున అధ్యక్షుడిగా సతీష్ కమాల్‌, ఉపాధ్యక్షుడిగా మేకల కృష్ణ, ప్రధాన కార్యదర్శి పదవికి పీవీ శ్రీనివాస్‌ పోటీ పడుతున్నారు. అలాగే, జాయింట్‌ సెక్రెటరీ పదవులకు మధుసూదన్‌రావు, తోకల సుదర్శన్‌, కోశాధికారి పదవికి పి.ఆనందం పోటీ చేస్తున్నారు. ఇక, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్లుగా మాణిక్యప్రభు, బర్ల శ్రీనివాస్‌, వాకిటి వెంకటేశం, చంద్రశేఖర్‌, భరత్‌ రెడ్డి, సర్వర్‌ బరిలో ఉన్నారు. 

ఇండిపెండెంట్ ప్యానల్‌ తరపున సభ్యులకు పలు హామీలు ఇస్తున్నారు. ప్రెస్‌క్లబ్‌ సభ్యులు, కుటుంబసభ్యులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పిస్తామని, కుటుంబసభ్యులకు కూడా ఐడీ కార్డులు జారీచేస్తామని తమ ఎజెండాలో పేర్కొన్నారు. నగరంలోని ప్రముఖ క్లబ్‌లతో అనుసంధానిస్తామని, క్లబ్‌ కమిటీలో ఇకపై స్పోర్ట్స్‌ సెక్రెటరీ, కల్చరల్‌ సెక్రెటరీ పదవులను కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. 

ప్రతీ ఆదివారం సాంస్కృతిక, వినోద కార్యకలాపాలు చేపడతామని, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తామని, జర్నలిస్టుల పిల్లలకు ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌, జాబ్‌మేళా, కెరీర్‌ గైడెన్స్‌ చేపడతామని ఇండిపెండెంట్ ప్యానల్‌ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. గ్రీన్‌మ్యాట్‌ స్టూడియో ఏర్పాటు చేస్తామని, వృత్తి నైపుణ్యం పెంచేలా సెమినార్లు, వర్క్‌షాపులు నిర్వహిస్తామని ఎజెండాలో చేర్చారు. అలాగే, ఉదయం నుంచి రాత్రి వరకు రెస్టారెంట్ సదుపాయం కల్పిస్తామని, జెనెరిక్‌ మెడిసిన్స్‌ కౌంటర్‌ ఏర్పాటు చేస్తామని ఇండిపెండెంట్‌ ప్యానల్‌ (Independent panel) హామీ ఇస్తోంది.

Also read : Hyderabad Press Club Elections: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు.. 'ఫ్రెండ్స్ ప్యానెల్' మేనిఫెస్టో

Also read : Hyderabad Press Club Elections: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు.. 'మన ప్యానెల్' మేనిఫెస్టో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News