Nalgonda: ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం..రూ.60 లక్షల ఆస్తినష్టం..!

Nalgonda: నల్గొండ జిల్లా కట్టంగూర్‌ మండలం అయిటిపాముల శివారులో ఉన్న శ్రీరాఘవేంద్ర ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ.60 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2021, 09:08 PM IST
Nalgonda: ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం..రూ.60 లక్షల ఆస్తినష్టం..!

Fire accident in Nalgonda: నల్గొండ జిల్లా(Nalgonda District)లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. కట్టంగూర్‌ మండలం అయిటిపాముల శివారులో ఉన్న శ్రీరాఘవేంద్ర ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలో ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటల(Fire)ను అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి అదుపుచేశారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఆయిల్‌ లీకేజీ వల్ల అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగినట్లు తెలుస్తోంది. 

Also Read:Jagtial Road Accident: ఆర్టీసీ బస్సు- కారు ఢీ.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు దుర్మరణం

ప్రమాదంలో సుమారు రూ.60 లక్షల నష్టం జరిగిందని పరిశ్రమ యాజమాన్యం వెల్లడించింది. ఎటువంటి ప్రాణహాని జరగకుండా కార్మికులందరినీ బయటకు పంపేసినట్లు తెలిపింది. మరోవైపు హైవేపై దట్టమైన పొగ అలుముకోవడంతో...సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందారు.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News