close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

మొబైల్ ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యార్థిని మృతి!

మొబైల్ ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యార్థిని మృతి!

Updated: May 26, 2019, 11:55 PM IST
మొబైల్ ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యార్థిని మృతి!

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని మారేడుపల్లి గ్రామానికి చెందిన మండల జ్యోతి(15) అనే విద్యార్థిని శనివారం ఇంట్లో మొబైల్ ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందారు. మండల స్వామి కూతురు జ్యోతి ఇంట్లో మొబైల్న్‌కు చార్జింగ్‌ పెడుతుండగా కరెంట్ షాక్ తగిలింది. షాక్ తగిలిన వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ధర్మారంలోని దవాఖానకు తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవలే 10వ తరగతిలో 8.7 జీపీఏతో ఉత్తీర్ణత సాధించిన జ్యోతి ఉన్నట్టుండి ఇలా శాశ్వతంగా దూరమవడం ఆ కుటుంబాన్ని కోలుకోలేని షాక్‌కి గురిచేసింది. 

మొబైల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యార్థిని షాక్ కొట్టి దుర్మరణం చెందారని తెలుసుకున్న ట్రాన్స్‌కో ఏఈ సుజిత్ ఘటన స్థలానికి చేరుకుని ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరాతీశారు. జ్యోతి తల్లి స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.