Hyderabad Weather Updates : నగరం నలుమూలలా భారీ వర్షం.. తడిసి ముద్దయిన హైదరాబాద్

Heavy Rains In Hyderabad: నగరంలో అనేక చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఇప్పటికే రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది.

Last Updated : Jun 21, 2022, 01:32 AM IST
  • నగరంలో అనేక చోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం
  • జలమయమైన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు
  • రంగంలోకి దిగిన మాన్సూన్, డిఆర్ఎఫ్, బృందాలు
Hyderabad Weather Updates : నగరం నలుమూలలా భారీ వర్షం.. తడిసి ముద్దయిన హైదరాబాద్

Hyderabad Rain Updates : హైదరాబాద్: నగరం నలుమూలలా భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల సోమవారం సాయంత్రం నుండే మొదలైన ఈ వర్షం.. అర్థరాత్రి సమయానికి మరింత ఎక్కువైంది. షేక్‌పేట్, గోల్కొండ, టోలిచౌకి, మెహదీపట్నం, బాపూఘాట్, లంగర్ హౌజ్, చందానగర్, శేరిలింగంపల్లిలో భారీ వర్షం కురుస్తోంది. అలాగే కూకట్‌పల్లి, మియపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.  

బోయిన్‌పల్లి, ఆల్వాల్, వెస్ట్ మారెడ్‌పల్లి, ఈస్ట్ మారెడ్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట్, ప్యారడైజ్, రాణిగంజ్, చిలకలగూడ, ముషిరాబాద్, ఉస్మానియా యూనివర్శిటీ, తార్నాక, ఉప్పల్, ఘట్‌కేసర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లోనూ ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది.  

నగరంలో అనేక చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఇప్పటికే రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రుతుపవనాల రాకతో వరుసగా కురుస్తోన్న వర్షాలతో అప్రమత్తమైన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం.. మాన్సూన్, డిఆర్ఎఫ్, బృందాలను లోతట్టు ప్రాంతాలకు పంపించి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. 

ఇదిలావుంటే, ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి (Hyderabad Mayor Vijayalakshmi) నగరవాసులను అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేశారు. నగర పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ప్రజలు కూడా అధికారులకు సహకరిస్తూ అవసరమైతే తప్ప ఇంట్లోంచి రావద్దని సూచించారు.

Also read : BJP Meeting: ప్రధాని మోదీ బహిరంగసభతో తెలంగాణ బీజేపీలో జోష్‌ వచ్చేనా..?

Also read : Agnipath Protest Case: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసుల స్పీడప్..వారి పాత్ర నిజమేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News