TSPSC Group-1 Prelims key 2022: ఇటీవల జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీను తాజాగా రిలీజ్ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC). దీంతోపాటు అభ్యర్థుల యెుక్క ఓఎంఆర్ జవాబు పత్రాలను కమిషన్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. మెుత్తం 2,85,916 మంది అభ్యర్థులు డిజిజల్ ఓఎంఆర్ పత్రాలను వెబ్ సైట్ లో పెట్టారు. టీఎస్పీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేసి జవాబు పత్రాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇవి నవంబరు 29 వరకు మాత్రమే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని కమిషన్ పేర్కొంది.
ప్రాథమిక కీపై (Group-1 Prelims key) నేటి నుంచి నవంబరు 4వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. కేవలం వెబ్ సైట్లోని ప్రత్యేక లింక్ ద్వారా మాత్రమే అభ్యంతరాలు నమోదు చేయాల్సి ఉంటుందని...ఈ-మెయిల్, వ్యక్తిగత అభ్యంతరాలు స్వీకరించమని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యంతరాలకు సంబంధించిన ఫ్రూవ్స్ ను కూడా లింక్ లో పీడీఎఫ్ ద్వారా జతపర్చాలని టీఎస్పీఎస్సీ పేర్కొంది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ విడుదల చేయడంతో అభ్యర్థుల్లో ఉన్న గందరగోళానికి తెరపడినట్లయింది. ప్రిలిమనరీ ఎగ్జామ్ లో వివిధ సిరీస్ లలో ప్రశ్నలతోపాటు సమాధానాలను కూడా జంబ్లింగ్ చేసి బహుళ సిరీస్ ల్లో ప్రశ్నాపత్రాలను రూపొందించింది టీఎస్పీఎస్సీ. వాటిన్నింటికీ మాస్టర్ గా ఉన్న ప్రశ్నపత్రాన్ని, దాని ప్రాథమిక కీను కమిషన్ వెబ్సైట్లో ఉంచింది.
Also Read: TRS MLAS BRIBE: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బిగ్ ట్విస్ట్.. మళ్లీ పోలీసుల అదుపులోకి నిందితులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి