Hyderabad Floods: ఓ వైపు కుండపోత... మరోవైపు గండిపేటకు భారీగా వరద.. హైదరాబాద్ కు జల గండమేనా?

Hyderabad Floods: హైదరాబాద్ కు గండం ముంచుకొస్తోందా? భాగ్యనగరంలో వరద విలయం స్పష్టించనుందా? లోతట్టు ప్రాంతాలు కకావికలం కానున్నాయా? అంటే కుండపోతగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ వాసుల్లో ఇదే భయం కనిపిస్తోంది. సోమవారం రాత్రి నుంచి హైదరాబాద్ పాటు నగర శివారు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. 

Written by - Srisailam | Last Updated : Jul 26, 2022, 03:45 PM IST
  • హైదరాబాద్ లో కుండపోతగా వర్షం
  • ప్రమాదకరంగా మూసీ ప్రవాహం
  • లోతట్టు ప్రాంతాల్లో భయంభయం
Hyderabad Floods: ఓ వైపు కుండపోత... మరోవైపు గండిపేటకు భారీగా వరద.. హైదరాబాద్ కు జల గండమేనా?

Hyderabad Floods: హైదరాబాద్ కు గండం ముంచుకొస్తోందా? భాగ్యనగరంలో వరద విలయం స్పష్టించనుందా? లోతట్టు ప్రాంతాలు కకావికలం కానున్నాయా? అంటే కుండపోతగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ వాసుల్లో ఇదే భయం కనిపిస్తోంది. సోమవారం రాత్రి నుంచి హైదరాబాద్ పాటు నగర శివారు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. అమీర్ పేట్ , పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, అబిడ్స్, దిల్ షుక్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, నారాయణ గూడ, పాతబస్తీ యాకుత్‌పురా, మల్లేపల్లి వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హయత్ నగర్. నారాయణ గూడలో 10 సెంటిమీటర్లకు పైగా వర్షం కురిసింది.

భారీ వర్షానికి వరదలు పోటెత్తడంతో  నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని కాలనీలు నదుల్లా మారిపోయాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో అర్ధరాత్రి ఆకస్మాత్తుగా వచ్చిన వరదలతో లోతట్టు ప్రాంత ప్రజలు హడలిపోయారు. భవనం పైకి ఎక్కి తమకు తాము కాపాడుకున్నారు. పాతబస్తీ యాకుత్‌పురా, మల్లేపల్లిలో భారీ వర్షానికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. వరదలో జంతువులు చిక్కుకున్నాయి. కొన్ని జంతువులు  కొట్టుకుపోయాయి. రహదారులు నదులను తలపించాయి. బేగం బజార్‌లో ఇళ్లు, షాపుల్లోకి చేరిన వర్షం నీరు చేరుకుంది. ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సామాగ్రి, నిత్యావసర వస్తువులు నీట మునగిపోయాయి.  ప్రధాన రహదారులపై మోకాల్లోతు నీరు నిలిచింది. జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి తగిన చర్యలు చేపట్టారు.

కుండపోతగా కురిసిన వర్షంతో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసారాంబాగ్ బ్రిడ్దిని ఆనుకుని మూసీ ప్రవహిస్తోంది. హుస్సేన్ సాగర్ డేంజర్ లెవల్ దాటిపోయింది. పైనుంచి వచ్చిన వరదను వచ్చినట్లు కిందకు వదులుతున్నారు. హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతంలో భయంభయం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో జనాలు ఉన్నారు. 2003లో వచ్చిన వరదలు తీవ్ర విషాదం నింపాయి. ఇప్పటికే మూసీ ఉప్పొంగి ప్రవహిస్తుండగా.. మూసీలోకి ఎగువ నుంచి వరద భారీగా వస్తోంది. జంట జలాశయాలకు ఊహించని వరద వస్తోంది. సోమవారం రాత్రి వికారాబాద్ , తాండూరుతో పాటు మూసి క్యాచ్ మెంట్ ఏరియాలో కుండపోతగా వర్షం కురిసింది. మంగళవారం కూడా నాన్ స్టాప్ గా వర్షం కురుస్తూనే ఉంది.

గండిపేటకు ఎగువ నుంచి దాదాపు 2 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇది అంతకంతకు పెరుగుతోంది. దీంతో గండిపేట రిజర్వాయర్ ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తి 2 వేల 118 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ కు వరద క్రమంగా పెరుగుతోంది. హిమాయత్ సాగర్ నుంచి 5 వందల క్యూసెక్కుల వరదను రిలీజ్ చేస్తున్నారు. ఇది కూడా మూసీలోనే ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో వస్తున్న వరదతో పాటు జంట జలాశయాల నుంచి వస్తున్న వరదతో మూసీ అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.  వరద పెరగడంతో సమీప ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరో మూడు రోజులు హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటికే వందలాది కాలనీలు చెరువులుగా మారిపోయాయి. ఈ నీరంతా పోవడానికి రెండు, మూడు రోజులు పడుతుందని అంటున్నారు. మళ్లీ వర్షం కురిస్తే పరిస్థితి ఏంటనే ఆందోళన వరద బాధిత కాలనీ వాసుల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయంలో అధికారులు ఆందోళన చెందుతున్నారు. వరదలతో హైదరాబాద్ కు ముప్పు పొంచి ఉందని కలవరపడుతున్నారు. 

Also Read: Nandamuri Balakrishna: బాలకృష్ణ వీడియోలు బయటకు.. బాబు బంగారం అంటూ!

Also Read: Komatireddy:కోమటిరెడ్డి రాజీనామా ఎప్పుడు? ఆయన వ్యూహం ఏంటీ?    

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News