Heavy Rains Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీకు తప్పని వర్షాలు

Heavy Rains Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా కోస్తాంధ్రకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. మరోవైపు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు సూచించారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 22, 2021, 03:50 PM IST
Heavy Rains Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీకు తప్పని వర్షాలు

Heavy Rains Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా కోస్తాంధ్రకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. మరోవైపు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు సూచించారు.

తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల్నించి వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం(Low Depression) కారణంగా రాష్ట్రంలో మరో రెండ్రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురవనున్నాయి. అటు కోస్తాంధ్రలో సైతం వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని..మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ(IMD)వెల్లడించింది.ఈ నేపధ్యంలో భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)..జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.వర్షాల పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు.ఇప్పటికే రెండ్రోజుల్నించి కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురవనుండటంతో అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి.

Also read: Ysr Kapu Nestham: రెండవ విడత వైఎస్సార్ కాపునేస్తం పథకం, లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News