హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 నియామకాలకు సంబంధించిన అడ్డంకులు తొలిగిపోయాయి. అభ్యర్ధుల ద్రువపత్రాల పరిశీలనకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇటీవలికాలంలో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్ధుల్లో మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్ధులు చొప్పున ఎంపిక చేసి ద్రువపత్రాల పరిశీలనకు ఆహ్వానించింది. దరఖాస్తుల ప్రకియ ప్రారంభమైన అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనం, అభ్యర్ధుల ఎంపికపై పులువురు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపించిన కోర్టు...నియామక ప్రక్రియపై స్టే విధించింది. కాగా స్టే గడువు ముగియడంతోధర్మాసనం గురువారం మరోసారి దీనిపై విచారణ జరిపింది. నియామక ప్రక్రియలో భాగమైన ద్రువప్రతాల పరిశీలకు అనుమతి ఇవ్వాలనికి టి.సర్కార్ అభ్యర్ధించింది...మరోవైపు స్టే పొడిగించాలని పిటిషన్లు కోరారు. ఇరువైపుల నుంచి వాదనలు విన్న కోర్టు..స్టే పొడిగించేందుకు నిరాకరించింది. ద్రువపత్రాల పరిశీలనకు టి.సర్కార్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పిటిషనర్లు అభ్యంతరాలు ఉంటే తదపరి విచారణలో చెప్పాలని పిటిషనర్లకు సూచింది. అనంతరం విచారణను అక్టోబర్ 9 నాటికి వాయిదా వేసింది.
ఒకట్రెండు రోజుల్లో షెడ్యూల్
నియామక ప్రక్రియకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో టి.సర్కార్ ఊపిరిపీల్చుకుంది. ద్రువపత్రాల పరిశీలనకు సంబంధించి.. ఒకట్రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తోంది. దీని సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా హైకోర్టు తాజా ఆదేశాలతో పరీక్షలో ఉత్తీర్ణులై..ద్రువపత్రాలకు ఎంపికైన అభ్యర్ధులు ఊపిరి పీల్చుకున్నారు.
గ్రూప్-2 నియామకాలకు లైన్ క్లియర్