తెలంగాణలో బీర్ల ధరలు భగ్గుమంటున్నాయి. ఎండాకాలంలో బీర్లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో ధరలు ఆకాశానంటుతున్నాయి. ప్రస్తుతం లైట్ బీర్ ధర రూ. 90 నుంచి రూ. 100కు పెరిగింది అలాగే స్ట్రాంగ్ బీర్ ధర రూ. 110 నుంచి రూ. 130కి పెంచారు. తెలంగాణ ప్రభుత్వం 10 నుంచి 20 శాతం మేరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో బీర్ల ధరలు ఈ మేరకు పెరిగాయి. ప్రభుత్వ ఉత్తర్వు సమాచారం అందగానే మద్యం దుకాణదారులు బీర్ల ధరలను అమాంతంగా పెంచేశారు. ఈ మేరకు ధరలను పెంచేసినట్టు బోర్డులు పెట్టి అధిక ధరలకు విక్రయాలు ప్రారంభించారు.