Job Mela In Hyderabad: జపాన్‌లోని స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్స్ (SSW) కింద తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM) జపాన్‌లో పనిచేసేందుకు అర్హత కలిగిన నర్సింగ్ సిబ్బందికి శిక్షణ, నియామకం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో టామ్ కామ్ రేపు హైదరాబాద్ విద్యానగర్లో జాబ్ మేళా కూడా నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ 2024 జనవరి 29న ఈ రిక్రూట్మెంట్ జరుపుతున్నట్లు సంస్థ సీఈఓ ప్రకటించారు. జాబ్ మేళాకు సంబంధించిన వివరాలకు 8919047600, 6302292450 నంబర్లకు డయల్ చేయాలని సూచించారు.
ఈ జాబ్ మేళాలలో ఎంపకైనవారికి రూ.1.50 వేల నుంచి 1.80 వేల వరకు జీతభత్యాలు ఉంటాయి.
టామ్ కామ్ నిర్వహిస్తోన్న అప్రెంటీస్ శిక్షణ కార్యక్రమానికి వయస్సు 22 నుండి 35 సంవత్సరాల వయస్సు. నమోదిత కళాశాలలు, సంస్థల నుండి తాజా B.Sc నర్సింగ్ గ్రాడ్యుయేట్లు , GNM డిప్లొమా హోల్డర్లు శిక్షణా కార్యక్రమానికి అర్హులు. విజయవంతమైన అభ్యర్థులకు నెలకు రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.50 లక్షల వరకు జీతాలు పొందవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు జపనీస్ భాషపై రెసిడెన్షియల్ శిక్షణ, జపాన్‌లో పని చేయడానికి అవసరమైన అదనపు వృత్తిపరమైన నైపుణ్యాలు అందిస్తారు.
ఈ సంస్థ జర్మన్ లో నర్సు ఉద్యోగాల కోసం కూడా శిక్షణ అందిస్తోంది. దీనికి ఇంటర్మీడియేట్లో 60 శాతానికి పైగా మార్కులు సాధించి ఉండాలి. స్టైఫెండ్లో లక్షరూపాయలు అందజేస్తారు. ఆ తర్వాత ప్లేస్ మెంట్ తర్వాత దాదాపు మూడు లక్షల రూపాయల వరకు అందజేస్తారు. ప్రస్తుతం జపాన్ నర్సు ఉద్యోగాల కోసం ఈ భారీ జాబ్ మేళాను నిర్వహిస్తోంది.
ఇదీ చదవండి: Free Bus To Medaram: మేడారం జాతరకూ ఉచిత బస్సు.. పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది: డిప్యూటీ సీఎం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook