డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ టాలీవుడ్ నటుడు

హైదరాబాద్‌లోని పలుచోట్ల ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి 132 మందిపై కేసులు నమోదు చేశారు.

Updated: May 13, 2018, 01:17 PM IST
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ టాలీవుడ్ నటుడు

హైదరాబాద్‌లోని పలుచోట్ల ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి 132 మందిపై కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లలో ఆరుచోట్ల ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 110 మందిపై ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేసి 110 వాహనాలను సీజ్‌ చేశారు. వీటిలో 80 కార్లు, 30 బైకులు ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లో జరిగిన తనిఖీల్లో నటుడు దామరాజు కీర్తి పట్టుబడ్డాడు. మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులు సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌పై చేపట్టిన తనిఖీల్లో అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 22 మందిపై కేసులు నమోదు చేశారు. 20 బైక్‌లు, కారు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.