HCU PROTEST: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. సెక్యూరిటీ దాడిలో విద్యార్థులకు తీవ్ర గాయాలు

HCU PROTEST:  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రణరంగంగా మారింది. విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులపై యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో క్యాంపస్ లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది.

Written by - Srisailam | Last Updated : Sep 24, 2022, 08:32 AM IST
HCU PROTEST: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. సెక్యూరిటీ దాడిలో విద్యార్థులకు తీవ్ర గాయాలు

HCU PROTEST:  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రణరంగంగా మారింది. విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులపై యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో క్యాంపస్ లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. విద్యార్థులు ఆందోళన తీవ్రం చేయడంతో యూనివర్శిటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

కామన్ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అయిన విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని కొన్ని రోజులుగా సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందంచకపోవడంతో  యూనివర్సిటీ లో ధర్నాకు దిగారు విద్యార్థులు. అయితే ధర్నాకు దిగిన విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేసింది యునివర్సిటీ సెక్యూరిటీ  సిబ్బంది. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది దాడిలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత విద్యార్థులు తమ ఆందోళన మరింత ఉధృతం చేశారు.

దేశ వ్యాప్తంగా సెంట్రల్ యూనివర్శిటీల్లో చదువుతున్న లక్షా 57 వేల మంది మంది విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసులు చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అదనంగా వసులు చేసిన డబ్బులను తిరిగి ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.

Also Read: Revanth Reddy: చంద్రబాబే నన్ను కాంగ్రెస్ లోకి పంపించారు.. రేవంత్ రెడ్డి సంచలనం

Also Read: Ind vs Aus 2nd T20 Match: ఆసిస్‌పై టీమిండియా విజయం.. ఉప్పల్ మ్యాచ్‌పై పెరిగిన ఉత్కంఠ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News