Ex BRS MLA Shakeel: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసు.. వెలుగులోకి మరో కీలక పరిణామం..

Hyderabad:మాజీ ఎమ్మెల్యే షకీల్ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ దుర్గారావు కొన్ని రోజులుగా పరారీలో ఉన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అనేక బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 5, 2024, 04:11 PM IST
  • - పోలీసు శాఖలో సంచలనంగా మారిన మాజీ ఎమ్మెల్యే కొడుకు కేసు..
    - పరారీలో ఉన్న సీఐ దుర్గారావు అరెస్టు..
Ex BRS MLA Shakeel: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసు..  వెలుగులోకి మరో కీలక పరిణామం..

EX MLA Shakeel Son Sahil Praja Bhavan Hit and Run Case: తెలంగాణలో బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడి కేసు తీవ్ర సంచలనం మారింది. ఈకేసులో ముఖ్యంగా షకీల్ కొడుకు, సాహిల్ ను తప్పించేందుకు పోలీసులు కూడా సహకరించినట్లు విచారణలో బైటపడింది. ఈ క్రమంలోనే పంజాగుట్టు సీఐ దుర్గారావు కొన్నిరోజులుగా పరారీలో ఉన్నారు. అయితే.. దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అటు నిజామాబాద్ లో కూడా మరో సీఐ కూడా దీనిలో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. మొత్తంగా ఈ వ్యవహరం తెలంగాణలో మాత్రం పెద్ద హట్ టాపిగ్ గా మారింది.

Read More: Glowing Skin Tips: గ్లోయింగ్ స్కిన్‌కు ఖరీదైన క్రీమ్స్ అవసరంలేదు.. ఈ ట్రిక్ పాటించండి చాలు..

ఈ కేసులో పంజాగుట్టు సీఐ ఏ 11 గా ఉన్నారు. ఆయన గత వారం రోజుల నుంచి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనను ఆదివారం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్ లో ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. అక్కడికి వెళ్లి పోలీసులుర.. దుర్గారావును అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం సిబ్బంది దుర్గారావును విచారిస్తున్నారు.

ఇప్పటికే సీఐ దుర్గారావు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దుర్గారావు అరెస్టుతో ఈ కేసులో ఎనిమిది మంది అరెస్టు అయినట్లు సమాచారం. మరో వైపు ఈ కేసును దర్యాప్తు చేయడం ఆపేయాలని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ గతంలో  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కోర్టు తోసి పుచ్చింది. కాగా, హైదరాబాద్ లో ప్రగతి భవన్ ఎదుట బ్యారికేడ్లను సాహిల్ ర్యాష్ డ్రైవింగ్ చేసి తన వాహనంతో ఢీకొట్టాడు.

Read More: Chiranjeevi as Hanuman: మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ వేషం వేసిన ఈ సినిమా తెలుసా..

అప్పటి నుంచి నిందితులు పరారీలో ఉన్నారు. సాహిల్ విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించి, లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా పంజాగుట్టలో కూడా కొందరు పోలీసులు సీక్రెట్ గా ఉండాల్సిన సమాచారం బైటకు చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పంజాగుట్టు పీఎస్ స్టాఫ్ ను మొత్తం ట్రాన్స్ ఫర్ చేసి సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి అందరిని షాకింగ్ కు గురిచేశారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News