Double Murder Case: భర్త, భార్య, ఇద్దరు పిల్లలు. మధ్యలో ఆమె ప్రియుడు. చదువుతుంటే ఓ సినిమా స్టోరీకి కాపీలా కనిపిస్తున్నా.. హైదరాబాద్‌లో జరిగిన వాస్తవం ఇది. ఈ కేసులో నిర్ఘాంతపోయే నిజాలు వెలువడ్డాయి. నమ్మశక్యం కాకున్నా నిజమిది..
సంచలనంగా మారిన హైదరాబాద్ జంట హత్యల కేసులో పూర్తి వివరాలు బయటకొచ్చాయి. నిర్ఘాంతపోయే నిజాలు వెలువడ్డాయి. వివరాలు తెలుసుకునే కొద్దీ సినిమా స్టోరీలా..అన్పిస్తుంది. కానీ ఇది కధ కాదు. వాస్తవం..
ఏం జరిగింది
భర్తకు తెలిసే ప్రియుడి వ్యవహారం నడిపిస్తున్న భార్య.. చివరిసారిగా ప్రియుడితో ఏకాంతంగా గడుపుతానని సంకోచం లేకుండా చెప్పింది. అప్పటికే భార్య ప్రవర్తనతో కుమిలిపోతున్న భర్త.. చివరిసారి అంటోంది కదా అని సరే చెప్పాడు. కానీ, తన కళ్లముందే ఆ ఘోరానికి తెగబడుతుంటే తట్టుకోలేకపోయాడు. ఇద్దరినీ దారుణంగా హత్య చేశాడు.
పోలీసుల విచారణలో
హైదరాబాద్ శివారులో జరిగిన జంట హత్యల కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో బయటపడ్డ అంశాలివి. అందరినీ షాకయ్యేలా చేసిన వివరాలివి. పోలీసుల దర్యాప్తులో ఇలా దిమ్మదిరిగే వివరాలు బయటకు వచ్చాయి. ఒళ్లు గగుర్పొడిచే అంశాలు తీవ్రంగా ఆలోచింపజేస్తున్నాయి. మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, దంపతుల మధ్య అనుబంధాల గురించి చర్చను లేవనెత్తుతున్నాయి.
ఎక్కడ ఎప్పుడు జరిగింది
అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలో రెండు రోజుల క్రితం మహిళ, పురుషుడి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. అభ్యంతకర రీతిలో డెడ్‌బాడీలు కనిపించాయి. ఇద్దరి శరీరాలపై నూలుపోగు కూడా లేకపోవడం, దారుణంగా హత్యకు గురికావడం, జనసమ్మర్థం లేని ప్రాంతంలో ఇద్దరూ నగ్నంగా పడి ఉండటం వంటి అంశాలతో ఇద్దరూ భార్యాభర్తలు అయ్యి ఉండకపోవచ్చన్న సందేహాల మధ్యే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈనెల 1వ తేదీనే ఈ జంట హత్యలు జరిగినట్లు తొలుత పోలీసులు గుర్తించారు. మహిళ భర్తే హంతకుడని నిర్ధారించారు. అయితే, పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత ఒళ్లు గగుర్పొడిచే అంశాలను పోలీసులు తెలుసుకున్నారు. ఎల్‌బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు.
అసలేమైంది
చనిపోయిన వాళ్లు జ్యోతి, ఆమె ప్రియుడు యశ్వంత్. జ్యోతికి పెళ్లయ్యింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. ప్రియుడి మోజులో జ్యోతి.. భర్తకు, పిల్లలకు ద్రోహం చేసిందన్న వివరాలను పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు. అయితే, భార్య కంత్రీ కోరిక, తెలిసి తెలిసీ తనకు ద్రోహం చేస్తుండటంతో జ్యోతి భర్త శ్రీనివాస్ తట్టుకోలేకపోయాడు. ప్రియుడితో ఏకాంతంగా గడుపుతానని పదేపదే భర్తనే అడుగతుండటంతో విసుగుచెంది ఇద్దరినీ హతమార్చినట్లు తేల్చారు.
విజయవాడకు చెందిన శ్రీనివాస్, జ్యోతి భార్యాభర్తలు. అయితే, జ్యోతి ప్రవర్తన తొలినుంచీ బాగాలేదని శ్రీనివాస్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. పలుమార్లు మందలించినా వినకపోవడమే కాకుండా.. ప్రియుడు యశ్వంత్‌తో తరచూ ఫోన్‌లో మాట్లాడేదని, ఇంట్లో తాను ఉండగానే, యశ్వంత్‌ను ఇంటికి పిలిచి మరీ తనముందే అతనితో అసభ్యకరంగా ప్రవర్తించేదని తెలిపాడు. హైదరాబాద్‌లో ఉంటే జ్యోతి మారే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చిన శ్రీనివాస్.. విజయవాడకు పూర్తిగా మకాం మార్చేందుకు నిర్ణయించాడు. జ్యోతిని కూడా బలవంతంగా ఒప్పించాడు. ఈ క్రమంలోనే ఇంట్లో సామాను అంతా సర్ది వాహనంలో విజయవాడకు పంపించేశాడు. బైక్‌పై భార్యాభర్తలిద్దరూ విజయవాడకు వెళ్లేందుకు పయనమయ్యారు.
Also read: Terrorists Plot For Bomb Blasts: దేశంలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర.. తెలంగాణకు ఆయుధాలు
భర్తకు తెలిసే వెళ్లిందా
అయితే, చివరి సారిగా తన ప్రియుడిని కలుస్తానని, కాసేపు మాట్లాడాక వెళ్దామని జ్యోతి భర్తను ఒప్పించింది. అంతేకాదు.. యశ్వంత్‌ను కలిసిన తర్వాత.. అతనితోనే బైక్‌పై విజయవాడ దాకా వస్తానని జ్యోతి వింత కోరిక కోరింది. కానీ, శ్రీనివాస్ అందుకు అంగీకరించలేదు. కనీసం ఎల్‌బీనగర్ వరకూ వస్తానని భర్తను ఒప్పించింది. ముగ్గురూ కలిసి ఎల్‌బీనగర్ ప్రాంతానికి వెళ్లారు. మధ్యలో మద్యం, బిర్యానీ కొనుగోలు చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతానికి వెళ్లగానే ముగ్గురూ కొత్తగూడెం వద్ద జాతీయ రహదారినుంచి లోపలికి వెళ్లారు. అక్కడ కూడా జ్యోతి.. చివరి సారిగా తాను ప్రియుడితో ఏకాంతంగా కలుస్తానని భర్త శ్రీనివాస్‌కు తన కోరిక చెప్పింది. తాను వెంట తెచ్చుకున్న మద్యం తాగుతూ ఉన్న శ్రీనివాస్ సరే అన్నాడు. దీంతో, జ్యోతి, యశ్వంత్.. శ్రీనివాస్‌కు కొద్ది దూరంలోకి వెళ్లి ఈలోకం మరిచిపోయారు. దగ్గర్లోనే శ్రీనివాస్ ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయారు. సరిగ్గా అదే సమయంలో కోపంతో రగిలిపోతున్న శ్రీనివాస్.. తన బైక్‌లో ఉన్న సుత్తి, ఇతర సామాగ్రి తీసుకెళ్లి ఇద్దరినీ హత్య చేశాడు. అనంతరం తన బైక్‌పై శ్రీనివాస్ విజయవాడ వెళ్లిపోయాడు.
మృతదేహాలు పడి ఉన్న ప్రాంతం, అక్కడ ఉన్న బైక్ ఇతర ఆధారాలతో వాళ్ల వివరాలు తెలుసుకున్న పోలీసులు.. విజయవాడ వెళ్లిపోయిన జ్యోతి భర్త శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో జరిగిందేంటో బట్టబయలు చేశారు. మొత్తానికి ఈ పరిణామం తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సంబంధాలను ప్రశ్నార్థకం చేసింది.
Also read: rahul gandhi tour in telangana : తెలంగాణకు రాహుల్... పర్మిషన్లు రాక కాంగ్రెస్ పరేషాన్..!