Hyderabad Lok Sabha Election Result: హైదరాబాద్‌లో మాధవీలతకు ఘోర పరాజయం.. అసదుద్దీన్‌ భారీ విజయం

Hyderabad Lok Sabha Election Result 2024: దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో మరోసారి పతంగి ఎగిరింది. అత్యంత ఉత్కంఠ పోరులో బీజేపీ అభ్యర్థి మాధవీలతకు ఘోర పరాభవం ఎదురవగా.. సిట్టింగ్‌ ఎంపీ అసదుద్దీన్‌ విజయం సాధించారు. 

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 4, 2024, 03:31 PM IST
Hyderabad Lok Sabha Election Result: హైదరాబాద్‌లో మాధవీలతకు ఘోర పరాజయం.. అసదుద్దీన్‌ భారీ విజయం

Hyderabad Lok Sabha Election Result 2024: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో నువ్వానేనా అనే తరహాలో పోటీ జరిగింది. దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి మిగతా స్థానాలతోపాటే మే 13వ తేదీన పోలింగ్ జరిగింది. పూర్తిగా పాతబస్తీ ప్రాంతం కావడంతో ఇక్కడి ఓటింగ్‌ శాతం చాలా తక్కువగా ఉంది. ఈ నియోజకవర్గంలో ఓటింగ్ 46.08 శాతంగా నమోదైంది. దేశ రాజకీయాల్లో అందునా తెలంగాణ రాష్ట్రం రాజకీయాల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.

Also Read: Hyderabad Lok Sabha Election: మజ్లిస్‌ అడ్డాలో మాధవీలత పాగా వేయనుందా? అసదుద్దీన్‌కు ఓటమి తప్పదా?

 

ఏఐఎంఐఎం తరఫున అసదుద్దీన్ ఒవైసీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఏకంగా 2,82,186 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి గాలిపటం ఎగురవేశారు. ఆయనకు మొత్తంగా పోలైన ఓట్లు 5,17,471. బీజేపీ తరఫున డాక్టర్‌ భగవంత్ రావు పోటీ చేశారు. ఆయనకు మొత్తం ఓట్లు 2,35,285. ఆ ఎన్నికల్లో 44.75 % మేర పోలింగ్ శాతం నమోదైంది.

Also Read: Hyderabad Lok Sabha: మాధవీలతకు భారీ షాకిచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌.. అసద్‌ గెలవబోతున్నారా?

2024 అభ్యర్థులు వీరే..
డాక్టర్ మాధవీలత, బీజేపీ
పులిపాటి రాజేష్ కుమార్, కాంగ్రెస్‌ పార్టీ
గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ

2019 ఎన్నికల్లో అభ్యర్థులు
అసదుద్దీన్‌ ఓవైసీ, ఏఐఎంఐఎం పార్టీ
పుస్తె శ్రీకాంత్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ (నాడు టీఆర్‌ఎస్‌)
డాక్టర్‌ భగవంత్‌ రావు, బీజేపీ
ఫిరోజ్‌ ఖాన్‌, కాంగ్రెస్‌ పార్టీ

2014 ఎన్నికలు
అసదుద్దీన్‌ ఓవైసీ, ఏఐఎంఐఎం పార్టీ
డాక్టర్‌ భగవంత్‌ రావు, బీజేపీ

హైదరాబాద్‌ లోక్‌సభ స్వరూపం
నియోజకవర్గం ఏర్పాటు:
1951
అసెంబ్లీ నియోజకవర్గాలు: కార్వాన్‌, గోషామహల్‌, నాంపల్లి, చార్మినార్‌, యాకుత్‌పుర, బహదూర్‌పుర, మలక్‌పేట,

1951లో మొదలైన ఈ ఎన్నికల్లో మొదట ఆరు సార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా.. పది లోక్‌సభ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ గెలిచింది. మధ్యలో ఒకసారి మాత్రం తెలంగాణ ప్రజా సమితి పార్టీ ఒకసారి విజయం సాధించింది.

హైదరాబాద్‌ విజేతలు వీరే..
- 1952, 1957, 1962, 1967లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. 
- 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి 1971లో విజయం సాధించింది. గోపాలయ్య సుబ్బుకృష్ణ మెల్కొటే ఎంపీగా నెగ్గారు.
- 1977, 1980లో కాంగ్రెస్‌ తరఫున కేఎస్‌ నారాయణ విజయం సాధించారు.
ఎంఐఎం అడ్డా
- 1984లో స్వతంత్ర అభ్యర్థిగా సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఓవైసీ నెగ్గారు.
- ఆ తర్వాత ఆయన ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఇతెహదుల్‌ ముస్లిమీన్‌ అనే పార్టీని స్థాపించారు. అనంతరం 1989 నుంచి 2024 వరకు ఏఐఎంఐఎం పార్టీనే ఏకచత్రాధిపత్యంగా గెలుస్తోంది. 1989, 1991, 1996, 1998, 1999 వరకు మజ్లిస్‌ తరఫున సలావుద్దీన్‌ ఎంపీగా గెలుస్తూ వచ్చారు.
- అనంతరం 2004 నుంచి ఆయన కుమారుడు అసదుద్దీన్‌ ఓవైసీ వరుసగా విజయం సాధిస్తున్నారు. 2004, 2009, 2014, 2019, 2024లో అసదుద్దీన్‌ తిరుగులేని ఆధిపత్యంతో నెగ్గుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News