అర్ధరాత్రి వరకు పరుగులు పెట్టనున్న హైదరాబాద్ మెట్రో రైలు

నేడు అర్ధరాత్రి వరకు పరుగులు పెట్టనున్న మెట్రో రైలు

Updated: Dec 31, 2018, 06:03 PM IST
అర్ధరాత్రి వరకు పరుగులు పెట్టనున్న హైదరాబాద్ మెట్రో రైలు

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నేడు నగరంలోని మెట్రో రైలు సమయాల్లో మార్పులు చేసినటట్టు మెట్రో రైల్ ఎండీ ఎన్.వి.ఎస్ రెడ్డి తెలిపారు. మియాపూర్, ఎల్బీనగర్, నాగోలు నుంచి అర్ధరాత్రి 12 గంటలకు చివరి మెట్రో రైలు బయలు దేరనుంది. అమీర్ పేట ఇంటర్‌చేంజ్ మెట్రో స్టేషన్ నుంచి అర్ధరాత్రి 12.30 గంటలకు చివరి మెట్రో రైలు బయలుదేరనుందని ఎన్.వి.ఎస్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుని తిరిగి ఇళ్లకు బయలుదేరే వారికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన స్పష్టంచేశారు.