HMRL timings, TSRTC timings: మెట్రో రైళ్లు, టిఎస్ఆర్టీసీ టైమింగ్స్‌లో మార్పులు

TSRTC timings, Hyderabad metro timings changed: హైదరాబాద్: తెలంగాణలో గురువారం జూన్ 10 నుంచి లాక్‌డౌన్‌ పొడిగింపుతో పాటు లాక్‌డౌన్ వేళల్లో మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో రైళ్ల వేళల్లోనూ మార్పులు చేసినట్టు హైదరాబాద్ మెట్రో రైలు (HMRL timings) అధికారులు తెలిపారు. అలాగే టిఎస్ఆర్టీసీ టైమింగ్స్‌లోనూ (TSRTC timings) మార్పులు చోటుచేసుకున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 10, 2021, 06:04 AM IST
HMRL timings, TSRTC timings: మెట్రో రైళ్లు, టిఎస్ఆర్టీసీ టైమింగ్స్‌లో మార్పులు

TSRTC bus timings, Hyderabad metro timings changed: హైదరాబాద్: తెలంగాణలో గురువారం జూన్ 10 నుంచి లాక్‌డౌన్‌ పొడిగింపుతో పాటు లాక్‌డౌన్ వేళల్లో మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో రైళ్ల వేళల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో రైలుతో ప్రారంభమయ్యే మెట్రో రైలు సేవలు సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండనున్నాయి. సాయంత్రం 5 గంటలకు చివరి మెట్రో రైలు బయల్దేరి సాయంత్రం 6 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటాయని హైదరాబాద్ మెట్రో రైలు (HMRL) అధికారులు తెలిపారు.

Also read : TS inter second year exams: తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దుపై మరో ప్రకటన

ఇదిలావుంటే, మరోవైపు టీఎస్ఆర్టీసీ బస్సుల సమయాల్లోనూ మార్పులు చేసినట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. లాక్‌డౌన్ వేళల్లో మార్పులు (Telangana lockdown timings) దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సాయంత్రం 6 గంటల వరకు బస్సులు (TSRTC bus timings during lockdown) అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్టు ఆర్టీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

Also read : Good news for farmers: రైతులకు గుడ్ న్యూస్.. ఖరీఫ్ పంటలకు MSP పెంచిన కేంద్రం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x