Hyderabad Murder Case: పోలీసులకు చిక్కిన కాల యముడు..విచారణలో కీలక విషయాలు..!

Hyderabad Murder Case: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యతో కొన్నిరోజులపాటు అన్యోన్యంగా మెలిగాడు. ఆ తర్వాత అసలు రూపం బయటకు వచ్చింది. నిత్యం గొడవ పడుతూ..కడతేర్చాడు. కటకటాల్లోకి వెళ్లాడు. కేసు విచారణలో విస్తు పోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి.

Written by - Alla Swamy | Last Updated : Jun 8, 2022, 11:40 AM IST
  • రెండో భార్యను హత్య చేసిన భర్త
  • మొదటి భార్య పిల్లల ముందే దారుణం
  • నిందితుడు అరెస్ట్
Hyderabad Murder Case: పోలీసులకు చిక్కిన కాల యముడు..విచారణలో కీలక విషయాలు..!

Hyderabad Murder Case: రెండో భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన భర్తను హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. జూబ్లీహిల్స్‌లో భార్య సరోజను డంబెల్స్‌తో కొట్టి చంపి డ్రమ్ములో కుక్కిన ఘటన తీవ్ర కలకలం రేపింది. విచారణలో నిందితుడు అనిల్‌ కుమార్‌ నుంచి కీలక విషయాలను రాబట్టారు. నిందితుడికి గతంలో వివాహమయ్యిందని..నలుగురు పిల్లలు ఉన్నారని గుర్తించారు. ఈవిషయమై రెండో భార్యతో గొడవలు జరిగేవని విచారణలో తేలింది.

ఈనేపథ్యంలోనే బంజారాహిల్స్‌ పీఎస్ పరిధిలోని ఇందిరానగర్‌లో నివసించే మొదటి భార్య పిల్లలను ఇంటికి తీసుకొచ్చాడు. ఈనెల 1న మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవ పడ్డాడు. తగాదా తీవ్రం కావడంతో ఇంట్లో ఉన్న డంబెల్‌తో పిల్లల ముందే ఆమె తలపై దాడి చేశాడు. చిన్నారులు ఏడవడంతో రక్తం మడుగులో ఉన్న భార్యను వస్త్రంతో చుట్టాడు. ఉదయాన్నే ఆస్పత్రికి తీసుకెళ్లానని పిల్లలకు చెప్పాడు.

ఉదయం లేవగానే పిల్లలను క్యాబ్‌లో అమ్మమ్మ ఇంటికి పంపాడు. అప్పటి నుంచి ఫోన్‌ పనిచేయడం లేదు. స్థానికులు గుర్తించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. డంబెల్‌తో కొట్టినప్పుడే సరోజ మృతి చెందిందా..లేక పిల్లలు నిద్రించిన తర్వాత మళ్లీ దాడి చేశాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలను ఇంటి నుంచి పంపిన తర్వాత డ్రమ్ములో శవాన్ని కుక్కాడా అన్న దానిపై ఆరా తీస్తున్నారు.

పోలీసుల విచారణలో పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. హత్య చేయలేదని, వివాహేతర సంబంధం ఉందని మరోసారి నిందితుడు సమాధానం ఇస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. డ్రమ్ములో శవాన్ని కుక్కాడా..లేక ముక్కముక్కలు చేసి పెట్టాడా అన్న దానిపై విచారణ చేస్తున్నారు. తమ ముందే దాడి చేశాడని మొదటి భార్య కుమార్తె పోలీసులకు తెలిపింది. 

Also read: Minor Rape Victims: రెచ్చిపోతున్న కామాంధులు..బాలికలపై ఆగని దారుణాలు..!

Also read:Ys Viveka Case: వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్..పులివెందులలో సీబీఐ మకాం అందుకేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News