జూలో సింహాలకు RT PCR test.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

Hyderabad Zoo park lions tested COVID-19 positive: హైదరాబాద్: కరోనావైరస్ లక్షణాలు మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ కనిపించడం ప్రస్తుతానికి ఆందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్ జూపార్కులోని 8 సింహాలకు కరోనా సోకిందన్న వార్త ప్రస్తుతం జంతు ప్రేమికులను కలవరపాటుకు గురిచేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 5, 2021, 02:47 AM IST
జూలో సింహాలకు RT PCR test.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

Hyderabad Zoo park lions tested COVID-19 positive: హైదరాబాద్: కరోనావైరస్ లక్షణాలు మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ కనిపించడం ప్రస్తుతానికి ఆందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్ జూపార్కులోని 8 సింహాలకు కరోనా సోకిందన్న వార్త ప్రస్తుతం జంతు ప్రేమికులను కలవరపాటుకు గురిచేస్తోంది. జూపార్క్‌‌లోని 8 సింహాలకు కరోనా సోకినట్లు వాటికి కరోనా పరీక్షలు చేసిన సీసీఎంబి వైద్య బృందం తేల్చింది. సింహాలకు నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్ టెస్టుల్లో ఫలితం పాజిటివ్‌ అని తేలింది. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (CCMB) శాస్త్రవేత్తలు, వైద్యుల బృందం ఈ పరీక్షల్లో పాల్గొన్నారు.

జూపార్క్ డైరెక్టర్ డా సిద్ధానంద్ కుక్రేటి ఈ విషయంపై మాట్లాడుతూ.. ''సింహాలకు కరోనావైరస్ లక్షణాలు ఉన్న మాట వాస్తవమే కానీ సీసీఎంబీ నుంచి ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్స్ (RT PCR test reports) ఇంకా అందనందున ఈ విషయంపై ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేను అని అన్నారు. 

Also read : Complete lockdown in India: ఇండియాలో లాక్‌డౌన్ విధించాలి: డా ఆంథోని ఫాసీ

అయితే, ఇదే విషయమై సీసీఎండి డైరెక్టర్ డా రాకేష్ మిశ్రాను (CCMB director Rakesh Mishra) జీ మీడియా వివరణ కోరగా.. సింహాలకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని స్పష్టంచేశారు. అదృష్టవశాత్తుగా ప్రస్తుతానికి సింహాలు ఆరోగ్యంగానే ఉన్నాయని.. సింహాలకు మాంసం పెట్టే జూ కీపర్స్ నుంచే వాటికి కరోనా (Coronavirus) సోకి ఉంటుందని భావిస్తున్నామని డా రాకేష్ మిశ్రా తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News