HYDRAA Khajaguda Demolition: హైదరాబాద్ ప్రజలను బెంబేలెత్తిస్తున్న హైడ్రాపై మరోసారి తీవ్ర దుమారం రేగుతోంది. సమాచారం లేకుండా చేపడుతున్న భవనాల కూల్చివేత.. విధ్వంసంపై మరోసారి న్యాయస్థానం మొట్టికాయలు వేయడంతో హైడ్రా స్పందించింది. అయితే న్యాయస్థానాన్ని కూడా హైడ్రా తప్పుబట్టింది. తాము చట్టానికి లోబడి కూల్చివేతలు చేపడుతున్నామని.. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తున్నామని వివరణ ఇచ్చింది.
Also Read: K Kavitha: రేవంత్ రెడ్డి వైఫల్యాలపై ఎల్లుండి కల్వకుంట్ల కవిత భారీ బహిరంగ సభ
ఏం జరిగింది?
ఖాజాగూడలోని భగీరథమ్మ చెరువు, తౌతోనికుంటలో హైడ్రా ఆకస్మికంగా కూల్చివేతలు చేపట్టింది. డిసెంబర్ 31వ తేదీన చేపట్టిన హైడ్రా కూల్చివేతలపై న్యాయస్థానాలు తప్పుబట్టడంతో బుధవారం హైడ్రా ఓ కీలక ప్రకటన చేసింది. చట్టాలను పాటిస్తూ.. న్యాయస్థానాల తీర్పులను గౌరవిస్తూ ఆక్రమణలు తొలగిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. భగీరథమ్మ చెరువు, తౌతోనికుంటలో ఆక్రమణల తొలగింపులు జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 405 ప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైడ్రా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉదహరించింది.
Also Read: KTR ACB Case: 'పాపం రేవంత్ రెడ్డి.. నన్ను జైలుకు పంపాలని విశ్వ ప్రయత్నాలు'
భగీరథమ్మ చెరువు, తౌతోనికుంటలో ఆక్రమణదారులకు వారం కిందట నోటీసులు ఇచ్చామని.. హైడ్రా కార్యాలయానికి పిలిపించి గూగుల్ ఎర్త్ ద్వారా వివరించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 3, 4 రోజుల్లో ఖాళీ చేయాలని ఆక్రమణదారులకు ఆదేశించినా ఖాళీ చేయకపోవడంతో డిసెంబర్ 30వ తేదీన మరోసారి నోటీసులు ఇచ్చి మరుసటి రోజు కూల్చివేతలు చేపట్టినట్లు వివరించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని ఆక్రమణలను కూల్చివేసినట్లు వెల్లడించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు హైడ్రా తెలిపింది. అయితే ఈ కూల్చివేతలకు సంబంధించి కొంత మంది హైడ్రాపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై వివరణ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.